Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి,సత్య రూమ్ కి వెళ్లి అక్కడ వారి ఫోటోలు చూసి బాధపడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దేవి, సత్య రూమ్ లో ఉన్న ఫోన్ బాక్స్ ని చూస్తూ ఉండగా ఇంతలోనే సత్య వచ్చి ఏంటి అలా చూస్తున్నావ్ అనడంతో సేమ్ ఇలాంటి ఫోన్ మా అమ్మ దగ్గర ఉంది అనడంతో వెంటనే సత్య షాక్ అవుతుంది. అప్పుడు సత్య మనసులో ఎందుకు ఆదిత్యాతనకు అబద్ధం చెప్పాడు అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు రాధ జరిగిన విషయాన్ని ఆదిత్య కు చెబుతూ ఉంటుంది.
ఆ మాధవ నన్ను ఇంటికి తీసుకుని వచ్చి అత్తమ్మ చూస్తుంది అన్న భయంతో నన్ను అక్కడినుంచి తీసుకొని వెళ్ళాడు అని అనగా అప్పుడు ఆదిత్య నిన్ను ఆ మాధవ భయపెట్టాలి అని ఇలా చేస్తున్నాడు అని అంటాడు. అప్పుడు ఆదిత్య మాధవ విషయంలో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు రాధ నాకు ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి మీరు తప్ప మరెవరు లేరు అని అంటుంది. అప్పుడు వాదించే అలా కాదు ఇంత దగ్గర ఉండి నేను నీకు ఏమి చేయలేకపోతున్నాను అని బాధపడతాడు.
అప్పుడు వెంటనే రాధ నీ బాధలు అన్నింటికి నేను త్వరలోనే ముగింపు పలుకుతాను అని అంటుంది. మరొకవైపు మాధవ ఒంటరిగా కూర్చుని రాధకు చాలా ధైర్యం వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి సత్య దేవి వస్తారు. అప్పుడు సత్య దేవి వాళ్ళ అమ్మ ఎక్కడ అని అడగగా ఎవరు ఫ్రెండ్ కల్పిస్తే బయటకు వెళ్ళింది అని చెబుతాడు మాధవ. ఆ తర్వాత దేవి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సత్య, మాధవతో అక్క ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది.
ఇక అప్పుడు మాధవ కావాలనే రాధ పై లేనిపోని మాటలు అన్నీ చెప్పి డ్రామా చేసి నాటకాలు ఆడతాడు. రాధా ఎప్పుడు ఫోన్లు మాట్లాడుతూ తనని పట్టించుకోవడం లేదని ఎవరు అని అడిగితే ఫ్రెండ్స్ అని చెబుతోంది అంటూ అబద్దాలు చెప్పి సత్యను నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. ఇక మాధవ మాటలకు సత్య ఆశ్చర్యపోతుంది. అప్పుడు మాధవ దొరికింది కదా సందు అని చెప్పి రాధ గురించి లేనిపోనివ్వని ఇంకొన్ని చాడీలు చెబుతూ ఉంటాడు.
మరొకవైపు దేవుడమ్మ,ఆదిత్య కోసం తన గదికి వెళ్ళగా అక్కడ దేవి ఫోటో కనబడుతుంది. అక్కడ దేవి ఫోటోకి మీసాలు పెట్టుకొని ఉండడం చూసి దేవుడమ్మ మురిసిపోతుంది. ఇంతలోనే ఆదిత్య అక్కడికి రావడంతో వెంటనే దేవుడమ్మ నీకు దేవికి దగ్గర పోలికలు ఉన్నాయి అని అనగా ఆదిత్య కూడా ఆ ఫోటో చూసి సంతోష పడుతూ ఉంటాడు. దాంతో దేవుడమ్మ కు కాస్త అనుమానం వస్తుంది. ఆ తర్వాత రాధా మాధవ పై పైర్ అయినా కూడా మాధవ మాత్రం అలాగే మాట్లాడతాడు.