Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ ఎంతమంది చెప్పినా కూడా రాధ నాకే సొంతం అని అనుకుంటూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో దేవికి కరాటే లో ప్రమోషన్ వచ్చినందుకు ఆదిత్య ఇంట్లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆదిత్య సత్యకు కేకు ఇవ్వబోతూ ఉండగా సత్య నాకు వద్దు అంటూ గట్టిగా అరుస్తుంది. ఎందుకు సత్య ఏమయ్యింది అలా అరుస్తున్నావు అని రాజమ్మ అడగగా.. ఇంకా ఏం కావాలి ఆంటీ నేను ఆదిత్య కలిసి తిని మాట్లాడుకొని ఎన్ని రోజులు అవుతుందో.
ఈరోజు నేను ఆదిత్య కలిసి బయటికి వెళ్లాలి అని రెడీ అయ్యాము. తీరా బయటికి వెళ్లే సమయానిలి ఇది వచ్చింది అంటూ దేవిని నానా మాటలు అంటూ దేవి పై విరుచుకుపడుతుంది. అది నీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నా ప్రతిసారి ఇది మధ్యలో వచ్చి నా సంతోషాన్ని చెడగొడుతుంది అని అంటుంది. దాంతో ఆ మాటలకు ఆదిత్య రాజమ్మ కమల ముగ్గురు షాక్ అవుతారు.
అప్పుడు ఎంతమంది చెప్పిన సత్య వినిపించుకోకుండా దేవి పై సీరియస్ అవుతుంది. మరొకవైపు రాధ పనిచేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన జానకి రాధా చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతుంది. అప్పుడు రాధ ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు అని అడగగా ఇన్ని రోజులు నువ్వు మౌనంగా ఉంటే ఎందుకు అనుకున్నాను కానీ అసలు కారణం ఈరోజే తెలిసిందిమ్మ.
అని అనగా వెంటనే రాధ తెలిసినా కూడా మీరు ఏం
చేస్తారు అని అనడంతో ఎందుకు చెయ్యను కొడుకు తప్పు చేస్తే మందలించాల్సిన బాధ్యత తల్లి అంటూ మాధవ చేసిన పనికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది జానకి. ఆయనతో చెప్పించి మాధవకు తగిన విధంగా బుద్ధి చెబుతాను నేను కూడా మాధవకు గట్టిగా వార్నింగ్ ఇస్తాను అని అంటుంది జానకమ్మ. ఇక వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు అన్నీ కూడా మాధవ చాటు నుంచి వింటాడు.
అప్పుడు మాధవ పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది ఎలా అయినా ఏదో ఒకటి చేసి రాదని దక్కించుకోవాలి అని అనుకుంటూఉంటాడు. మరొకవైపు రాధ ఆదిత్య ఇంటి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో ఆదిత్య వచ్చి దేవిని ఆపుతాడు. అది కాదమ్మా దేవి నేను చెప్పేది విను మీ పిన్ని కోపం అంతా నీ మీద కాదు నా మీద అని అంటుంది. అప్పుడు దేవి నాకు అర్థం సారు. ఇంకెప్పుడు నేను మీ ఇంటికి రాను అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
మీరు వస్తారా లేక నేను వెళ్ళిపోమంటారా అని బయలుదేరుతూ ఉండగా ఇంతలోనే మాధవ అక్కడికి వస్తాడు. అప్పుడు దేవి ఎమోషనల్ గా వెళ్లి మాధవాని హత్తుకుని ఏడుస్తూ నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను వెళ్ళిపోదాం పద అని అంటుంది. అప్పుడు ఇంతలోనే సత్య అక్కడికి వస్తుంది. అప్పుడు సత్య మాధవ పై కూడా ఫైర్ అవుతుంది. దాంతో వెంటనే మాధవ సత్యం ముందు ఆదిత్యను అడ్డంగా బుక్ చేస్తాడు.