Devatha Sep 7 serial Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రాధ, దేవిని అక్కడే ఉంచడానికి సరే అని చెబుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో మాధవ రాధ,దేవి గురించి ఆలోచిస్తూ రాధ, ఆదిత్యతో మాట్లాడితేనే దేవిని అక్కడికి పంపాలి అన్న ఆలోచన వచ్చింది అంటే వాళ్ళ అమ్మతో మాట్లాడితే దేవితో పాటు తాను కూడా వెళ్ళిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఏదో ఒకటి చేసి వాళ్ళ మధ్య దూరం పెంచాలి అని అనుకుంటూ ఉంటాడు మాధవ.
ఆ తర్వాత చిన్మయి భోజనం చేస్తూ అమ్మాయి పచ్చడి చాలా బాగుంది నాకు నచ్చింది దేవికి ఇంకా బాగా నచ్చుతుంది అని మాట్లాడుతూ ఉంటుంది. మరొకవైపు దేవుడమ్మ దేవికి బట్టలు కుట్టడానికి కొలతలు తీస్తూ ఉంటుంది. అప్పుడు దేవి ఇప్పుడు ఎందుకు కొలతలు తీస్తున్నావు దేవుడమ్మ అవ్వల అని అడగగా నీకు పండగకి బట్టలు కుడతాను అని అంటుంది దేవుడమ్మ.
Devatha Sep 7 serial Today Episode : సంతోషంలో దేవుడమ్మ…
అప్పుడు దేవి నీకు బట్టలు కుట్టడం కూడా వచ్చా అని అడగడంతో పొలం పనులు కూడా చేస్తాను అని దేవుడమ్మ అనగా వెంటనే దేవి మా అమ్మ కూడా పొలం పనులు బాగా చేస్తుంది అని అంటుంది. అప్పుడు దేవుడమ్మ తలచుకుని ఇక్కడే ఉండి ఉంటే బాగుండేది అని బాధపడుతుంది. ఆ తర్వాత చిన్న రుక్మిణి పడుకుని ఉండగా అప్పుడు చిన్మయికి దేవి గురించి పీడకల రావడంతో దేవి అని గట్టిగా అరుస్తుంది.
అప్పుడు అమ్మ నాకు దేవి లేకపోతే ఇలానే ఉంది దేవిని తెచ్చుకుందాం లేదంటే నేనే ఆఫీసర్ సార్ ఇంటికి పంపించు దేవి లేకుండా ఉండలేకపోతున్నాను అని అంటుంది. మరొకవైపు దేవికి దేవుడమ్మ బట్టలు కుట్టిస్తుంది. ఆదిత్య అక్కడికి వచ్చి దేవి గురించి సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవితో ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది దేవుడమ్మ.
ఆ మాటలకు ఆదిత్య కూడా ఆనంద పడుతూ ఉంటాడు. ఇక వారి మాటలు విన్న సత్య దేవి అంటే ఆదిత్యకు ఎందుకు అంత ఇష్టం అంటూ అనుమాన పడుతుంది. ఆ తర్వాత జానకమ్మ, రామ్మూర్తి వాళ్ళు ఇల్లు అలంకరిస్తుండగా చిన్మయి కనిపించకపోవడంతో చిన్మయి ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు రాదా చిన్మయి ని తయారు చేస్తుంది అని అంటుంది. అప్పుడు చిన్మయి చీర కట్టుకొని కిందికి రావడంతో అచ్చమహాలక్ష్మి లా ఉన్నావు రాధ లాగే ఉన్నావు అని అంటుంది జానకమ్మ. కానీ చిన్మయి మాత్రం సంతోషంగా లేకుండా నాకు దేవి కావాలి నేను అలిగాను అని అంటుంది.
Read Also : Intinti Gruhalakshmi: అభి,అంకితను విడిపోమని చెప్పిన గాయత్రి.. తులసి పై కోపంతో రగిలిపోతున్న సామ్రాట్..?