Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రిషీ అన్న మాటలకు మహేంద్ర ఎమోషనల్ అవుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర రిషి అన్న మాటలు తలచుకుని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో జగతి ఎక్కడికి వచ్చి ఓదారుస్తుంది. నేను స్వార్ధపరుడిన జగతి, రిషి నా ప్రాణం అంటూ ఏడుస్తూ జగతి భుజంపై తలపెట్టి బాధపడుతూ ఉంటాడు మహేంద్ర. ఇక వారిద్దరూ ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ధరణి, గౌతమ్ ఇద్దరూ టెన్షన్ పడుతూ వస్తారు.
అప్పుడు వసుధార కనిపించలేదు అనడంతో జగతి దంపతులు టెన్షన్ పడతారు. ఇక అందరూ కలిసి వెతుకుదాం అని అనగా ఇంతలోనే గౌతమ్ రిషి దగ్గరికి వెళ్లి వసు కనిపించడం లేదు అనడంతో మొదట షాక్ అయిన రిషి అయితే ఏం చేయాలి అన్నట్టుగా మాట్లాడుతాడు. అదేంటి రిషి అలా మాట్లాడుతున్నావ్ అని అనగా గౌతమ్ ని తిట్టి అక్కడ నుంచి పంపిస్తాడు రిషి. ఆ తర్వాత వసుధార కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో టెన్షన్ పడతాడు రిషి.
ఇక వసు ని వెతుకుతూ వెళ్ళగా మేడపైన వసుధార ఆకాశదీపం వదులుతూ తన బాధలు చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు వసుధారని చూసిన రిషి మొఖం ఒకవైపు తిప్పుకుంటాడు. అప్పుడు వెంటనే వసుధార మీ ముఖం కూడా చూపించలేనంత తప్పు నేను ఏం చేశాను సార్ అని అనగా రిషి ఈ కోపంతో తప్పుల గురించి మాట్లాడొద్దు వసు అని అంటాడు.
ఇప్పుడు వసుధారా అసలు విషయం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా రిషీ వినిపించుకోకుండా కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరు కూర్చుని ఉండగా ఇంతలో రిషి బయటికి వెళుతుండడంతో వెంటనే దేవయాని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగడంతో పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.
అప్పుడు వసుధర కకూడా రిషి వెనకాలే వెళ్తుండడంతో దేవయాని ఆపి అవమానించే విధంగా మాట్లాడి ఇంటికి వచ్చిన పరాయి వాళ్లకి మా ఆనవాయితీ ప్రకారం చీర పెట్టడం పద్ధతి అంటూ పసుధారని నానా మాటలు అని చీర ఇస్తుంది. అప్పుడు ఆ ఆ చీరను దేవయాని జగతి చేతుల మీదుగా ఇప్పిస్తుంది. ఆ తర్వాత ధరణి ఆచీరను ఒక బ్యాగులో పెట్టిస్తాను అని లోపలికి తీసుకెళ్లగా వసుధర దేవయాని మాటలకు కోపంతో చీర తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తర్వాత వసు రిషి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉండగా వసుధర,రిషి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇద్దరు ఒకచోట రోడ్డు పై కారు ఆపి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు నన్ను రిషి గా ప్రేమించావా? లేక జగతి మేడం కొడుకుగా ప్రేమించావా అని అనగా, నేను ప్రేమించిన వ్యక్తి జగతి మేడం కొడుకు కాదా సార్ అని వసు అంటుంది.
నేను నిన్ను ప్రశ్ని అడిగితే నువ్వు తిరిగి నన్ను ఇంకో ప్రశ్న అడుగుతున్న వసుధార అని అనగా మీ ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది సార్, కానీ మీరు నన్ను మాట్లాడనివ్వడం లేదు అలా వారిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా వసు, రిషికి ఎంత నచ్చి చెప్పడానికి ప్రయత్నించినా కూడా రిషి వినిపించుకోడు. అప్పుడు రిషి వసదారని మరింత అపార్థం చేసుకుంటాడు.