Karthika Deepam November 8 Today Episode: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత కార్తీక్ రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఇంటికి రాలేదు అని మోనిత టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి కార్తీక్ రావడంతో ఏమైపోయావు కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా నేను ఎంత టెన్షన్ పడుతున్నాను అని అనగా వెంటనే కార్తీక్ ఇంట్లో దుర్గ గారు లేరా అని అడుగుతాడు. ఆ మాటకు షాక్ అయిన మోనిత ఏం మాట్లాడుతున్నావ్ కార్తీక్ అంటూ కార్తీక్ పై సీరియస్ అవుతుంది. అప్పుడు కార్తీక్ మీ ప్రేమ అబద్ధం అని తెలిసిన తర్వాత కూడా నటిస్తే బాగోదు మోనిత అసహ్యంగా ఉంటుంది అని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అప్పుడు మోనిత నా ప్రేమ నీకు నటనలాగా కనిపిస్తోందా కార్తీక్ నీ ప్రేమ కోసం నేను ఏ ఆడపిల్ల చేయకూడని పనులు చేశాను ఇంతవరకు నాలో ప్రేమను చూసావు నాలో పంతాన్ని చూడలేదు. ఇకపై నా పంతాన్ని చూస్తావు. ఆ దీప నీ ఏదో ఒకటి చేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మోనిత. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం దీప కార్తిక్ లు సౌర్య కోసం ఇంద్రుడి ఇంటికి వెళ్లగా అక్కడ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు.
మనం పాపని ఎక్కడ తీసుకెళ్తానేమో అని జాగ్రత్తగా ముందుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉంటారు దీప. ఇప్పుడు దీప శౌర్య కచ్చితంగా వీళ్ళ దగ్గరే ఉంటుంది డాక్టర్ బాబు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే ఇంట్లో నుంచి ఓనర్ రావడంతో ఇల్లు అద్దెకు కావాలా ముందు ఇల్లు మొత్తం చూడండి ఆ తర్వాత కావాలంటే అద్దె గురించి మాట్లాడదాం అనడంతో దీప కార్తిక్ వెళ్లి ఇల్లంతా వెతుకుతూ ఉంటారు.
ఇంతలోనే సౌర్య ఫంక్షన్ కి సంబంధించిన ఫోటో దీపకు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి డాక్టర్ బాబు అని పిలవగా కార్తీక్ అక్కడికి వచ్చి ఏమయింది అనటంతో దీప ఆ ఫోటోని చూపించగా కార్తీక్ కూడా షాక్ అవుతాడు. చూడండి డాక్టర్ రా బాబు ఇది నా శౌర్య ఇవి మనం కొనిచ్చిన బట్టలు నగలు. కానీ వీటిని వేరే అమ్మాయికి వేసి మనకి చూపించారు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మనం వాళ్ళని నిలదీయడం వల్ల వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఉన్నారు డాక్టర్ బాబు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది దీప.
Karthika Deepam నవంబర్ 8 ఎపిసోడ్ : సౌర్య ఫంక్షన్ ఫోటో చూసి దీప ,కార్తీక్ షాక్..
అక్కడినుంచి వెళ్లిపోయిన దీప గుడిలో బాధను భరించలేక గంట కొడుతూనే ఉండగా ఇంతలో పంతులుగారు అక్కడికి వచ్చి ఏమైంది అమ్మ అనిపించుకోకుండా గంటను కొడుతూనే ఉన్నావు అని అంటాడు. అప్పుడు కార్తీక్ దీప ని బలవంతంగా ఆపుతాడు. ఆ తర్వాత కార్తీక్ దీప ని ఓదారుస్తాడు. నా బాధ అది కాదు డాక్టర్ బాబు నాకు ఆ దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నేను నా బిడ్డను గుర్తించలేకపోయాను వాళ్ళు వద్దు అంటే మాత్రం నా బుద్ధి ఏమైంది లోపలికి వెళ్లి చూడాలి కదా అంటూ దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
వాళ్ళకి నేను అన్యాయం చేశాను డాక్టర్ బాబు నా బిడ్డను నా దగ్గర నుంచి దూరం చేశారు అని ఏడుస్తూ ఉంటుంది దీప. అప్పుడు కార్తీక్ ఓదారుస్తూ నువ్వు ఏం చేస్తావు నీ ప్రయత్నం చేసావు కదా దీప. సౌర్య వాళ్ళ దగ్గరే ఉంది అని మనకు తెలిసింది కదా ఇక వాళ్లు ఎక్కడ ఉన్నా సౌర్యని వెతికి పెట్టి నీకు అప్పగించే బాధ్యత నాది అని కార్తీక్ మాట ఇస్తాడు. ఇప్పుడు దీప ఎమోషనల్ అవుతూ ఉండగా కార్తీక్ హిమ గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత దీప ని కార్తీక్ అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు సౌర్య వాళ్ళు ఆటోలో వెళుతూ ఉండగా మనం ఏ ఊర్లో ఉన్నాం బాబాయ్ అని అడుగుతుంది సౌర్య.
ఆరోజు మీ అమ్మ కనిపించింది అని చెప్పాము కదా అమ్మ ఆ ఊరే కాకపోతే దాని పక్క ఊర్లో ఉంటున్నాము ఆ ఊర్లో ఇల్లు అద్దెకి ఎక్కువ ఉన్నది అనగా శౌర్య అనుమానంగా అనగా అడగడంతో నిజమే అని అంటాడు ఇంద్రుడు. ఆ తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్ళగా అక్కడ ఇంద్రుడి ప్రవర్తన పై సౌర్య కి అనుమానం వస్తుంది.