DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం అంటే డీఏ. డీఆర్ లు మళ్లీ పెరిగే అవకాశం ఉందట. పలు మీడియా నివేదికల ప్రకారం వచ్చే నెల ప్రారంభంలో ఈ విషయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, సంబంధిత భత్యం పెంపు ఫలితంగా … కేంద్ర ప్రబుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు పెరుగుతాయని నివేదికలు పేర్కొన్నాయి. డీఏ డీఆర్ లను సాధారణంగా ప్రభుత్వం జనవరి, జులైలో వరిస్తుంది. డీఏ, డీఆర్ అనేవి ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే జీతం. పెన్షన్ లోని బాగాలు ఆకాశాన్ని అంటుతున్న వేళ… ద్రవ్యోల్బణం మధ్య వివి వర్గాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ లు పెంచితే వారికి పెద్ద ఉపశమనం కల్గుతుంది.

DA Hike
కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దాదాపు 1.15 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయం ద్వారా లభ్ది పొందనున్నారు. 2020 జనవరి నుంచి జూన్ 30, 2021 వరకు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపును ఆపింది. ఆ తర్వాత డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. 2021 అక్టోబర్ లో డీఏ మళ్లీ 3 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది. ఈ ఏడాది జనవరిలో భృతిని 34 శాతానికి పెంచారు.
Read Also : Government jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ డిపార్ట్ మెంటులో 38,926 ఉద్యోగాలు!