Bigg boss divi : బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. అందుకు కారణం నాకు తోడు కావాలంటూ ఓపెన్ పోస్ట్ పెట్టడమే. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేస్కుంది దివి వాద్యా. మొదట లైట్స్ గో, సీన్ నెంబర్ 72 సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా రాని గుర్తింపు ఒక్క బిగ్ బాస్ ద్వారా సొంతం చేసుకుంది. అక్కడే హీరో చిరంజీవితో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

ప్రస్తుతం దివి చాలా బిజీ అయిపోయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. మరోవైప సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఎప్పుడూ కుర్రకారుకు పిచ్చెక్కించే ఈ అమ్మడు… తాజాగా చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నాకో తోడు కావాలని.. ఫుడ్ ఫ్రెండ్ కావాలంటూ.. లవ్ సింబల్ తో పోస్టు పెట్టింది. అలాగే ప్రతి శుక్రవారం ఆ స్నేహితుడితో కిలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ ట్రై చేస్తానని చెప్పింది. దీంతో ఓ పోస్ట్ కాస్త కొద్ది సమయంలోనే తెగ వైరల్ గా మారింది.
Read Also : Anasuya in bigg boss : బిగ్ బాస్ సీజన్ 6లో అనసూయ..? ఎంత అడిగిందంటే?