Big boss 6: బిగ్ బాస్ లో అప్పడే మొదలైన తొలి లవ్ ట్రాక్, ఎవరో తెలుసా?

Big boss 6: బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఈసారి కూడా ఈ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ లో 21 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా… వీరిలో కొన్ని ముఖాలు అందరికీ తెలిసినవి కాగా.. మరికొన్ని మొహాలు కొత్తవి. అయితే మొదటి వారం గడవలు, ఏడుపులు, సరదాలతో గడిచిపోగా… రెండో వారం మాత్రం మరిన్ని గొడవలు పెరిగాయి. కంటెస్టెంట్ల మధ్య వార్ హీట్ కూడా బాగానే పెరిగిపోయింది. కెప్టెన్సీ పోటీ కోసం ఒకరి మీద ఒకరు పోటీతో ఆట ఆడటం స్టార్ట్ చేశారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ప్రతీ సీజన్ లాగానే… ఈ సారి కూడా ఫస్ట్ లవ్ ట్రాక్ ప్రారంభం అయింది. ఓ ఇద్దరు ఒఖరికొకరు దగ్గర కాబోతున్నారు.

Advertisement

ప్రతి సీజన్ లో కూడా ఓ ప్రేమ జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అయితే ఈ సీజన్ లో ఆర్జే సూర్య, ఆరోహి రావు జంట కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్జే సూర్య తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఆరోహి రావు కూడా ఇప్పుడిప్పుడే ఆట మీద తన దృష్టి పెడుతూ.. ప్రేక్షకులకు దగ్గర అవుతోంది. ఈ సీజన్ లో చూసినట్లయితే ఆరోహి రావు, సూర్య ఇద్దరూ ఎప్పుడూ కూడా పక్కపక్కనే కూర్చుంటున్నారు. అంతే కాకుండా హౌస్ లో ఉన్న మగితా కంటెస్టంట్ ల గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నారు. కానీ రెండో వారంలోనే ఈ ప్రేమ జంటను ఫిక్స్ చేయడం కొంచెం కష్టం. అయితే రానూరానూ వీరి మధ్య సంబంధం ఎలా ఉంటుందో దాన్ని బ్టి మనం అర్థం చేసుకోవచ్చు.

Advertisement