NTR august Tragedy: సీనియర్ ఎన్టీ రామారావు ఇంట్లో విషాదం నెలకొంది. దివంగత ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆగస్టు ఒకటిన ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన గదిలోనే చున్నీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే ఎన్టీ రామారావు కుటుంబానికి ఆగస్టు నెల కలిసి రావడం లేదు. ఆ కుటుంబానికి ఆగస్టు నెలలో తీవ్ర విషాదకర ఘటనలు ఎదురయ్యాయి. 2019 దివంగత ఎన్టీఆర్ నాల్గవ కుమారుడు అయిన హరి కృష్ణ ఆగస్టులోనే మృతి చెందాడు. అయితే హరి కృష్ణ పెద్ద కుమారుడు, కల్యాణ్ రామ్ అన్న నందమూరి జానకి రామ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికే కాకుండా ఆయన స్థాపించి అధికారం సాధించిన తెలుగు దేశం పార్టీకి కూడా ఆగస్టు నెల కలిసి రాలేదు. 1984 సంవత్సరం ఆగస్టు నెలలో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేశారు. అలా ఆగస్టు నెలలో ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్ప కూలింది. 1995 సంవత్సరంలో ప్రస్తుతం టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు అదే ఏడాది ఆగస్టులోనే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు.