...

Anchor ansuya : జబర్దస్త్ ను అందుకే వీడానంటూ షాకింగ్ కామెంట్లు చేసిన అనసూయ!

Anchor ansuya : దాదాపు 9 ఏళ్ల పాటు జబర్దస్త్ యాంకర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ సాగించిన యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన నాగబాబు అండ్ కో బ్యాచ్ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

అప్పట్లో నాగబాబు.. ఆ తర్వాత అతని శిష్యుడు కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కామెడీ షోపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే అనసూయ మాత్రం వివాదాల జోలికి పోకుండా జబర్ద్త్ నుంచి గౌరవంగానే బయటకు వచ్చేసింది. ఎక్కడా ఆ గురించి కానీ మల్లెమాల ప్రొడక్షన్ బౌస్ గురించి కానీ నెగటివ్ గా మాట్లాడలేదు. మల్లెమాల ప్రొడక్షన్ గురించి కూడా నోరు మెదపలేదు.

anchor-anasuya-shocking-comments-about-the-reasons-to-left-jabadasth
anchor-anasuya-shocking-comments-about-the-reasons-to-left-jabadasth

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను ఎందుకు జబర్దస్త్ వీడాల్సి వచ్చిందో కారణాలు వివరించింది. ప్రస్తుతం నడుస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. అనసూయ మాట్లాడుతూ.. జబర్దస్త్ నుంచి బయటకు రాగానే థర్డ్ ప్రాసెస్ రెండేళ్ల నుంచి జరుగుతూ ఉంది.

మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ నాను మంచి అవకాశాలను ఇచ్చింది. అక్కడ మంచి వ్యక్తులు ఉన్నారు. అదే సందర్భంలో చాలా వివాదాలు కూడా వచ్చాయి. జబర్దస్త్ లో ఉన్న వాళ్లకి దిష్టి తగిలిందంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. తనకు వరుసగా సినిమా అవకాశాలు రావడం వల్లే జబర్దస్త్ కు బై చెప్పినట్లు వివరించారు.

Read Also : Anchor anasuya: జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై.. లైవ్ లో ఏడ్చేసిన ఇంద్రజ!