Amazon Freedom Sale: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నడుస్తోంది. ఆగస్టు 6 నుండి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ గ్రేట్ ఫ్రీడం సేల్ జరగనుంది. పలు ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్ ఇస్తోంది ఈ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం. 70శాతం డిస్కౌంట్ తో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మరో 10% శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ బ్రాండ్ ప్రొడక్టులపై 70 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ప్రకటించింది. అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీలు, ఏసీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు అలాగే వివిధ కేటగిరీల్లోని ఉత్పత్తులపై గొప్ప డీల్స్ ఉన్నాయి. ఆఫర్లను పొందే అవకాశం ఉంది. ఈ గ్రేట్ ఫ్రీడం సేల్ లో చాలా ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. స్మార్ట్ టీవీలపై ఈ సేల్ లో చాలా ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి. ఫోన్లకు ప్రత్యేకంగా ఆఫర్లను ప్రకటించింది.
వన్ ప్లస్ నార్డ్ 2T 5G మోడల్ ధర కేవలం రూ.28,998 మాత్రమే. వివిధ ఆఫర్లు పోనూ తక్కువ ధరకే వస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్న వారికి అదనపు ప్రయోజనం ఉంటుంది. దానిపై 10శాతం అదనంగా డిస్కౌంట్ వస్తోంది. ఐకూ నియో 6 5G ఫోన్ రూ.28,999 కే వస్తోంది. ఎస్బీఐ వినియోగదారులకు అదనంగా మరో రూ.2,250 తగ్గనుంది.