...

Janaki Kalaganaledu: ఒక్కటైన జెస్సి, అఖిల్.. జానకి పై కోపంతో రగిలిపోతున్న జ్ఞానాంబ..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జెస్సి అఖిల్ తో మాట్లాడుతూ నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో జెస్సి, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నిన్ను కేవలం నా బిడ్డ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను నా బిడ్డ భవిష్యత్తు పాడవకూడదు అని అనడంతో వెంటనే అఖిల్ ఎమోషనల్ అవుతూ నువ్వు ఇటువంటి సంబంధం లేదు అని అమ్మ కూడా సంబంధం లేదు అని నన్ను ఒంటరి వాడిని చేయొద్దు నన్ను క్షమించు జెస్సి.

నువ్వు లేకపోతే నేను ఉండలేను జెస్సీ కాల మీద పడతాడు. అప్పుడు జెస్సి దగ్గరికి తీసుకొని అఖిల్ ని ఓదారుస్తుంది. మరొకవైపు జ్ఞానాంబ జానకి విషయంలో తప్పు చేశాను ఎలా అయినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అవసరంగా జానకిని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది.

ఆ తర్వాత జానకి విషయంలో ఒక తప్పును చెరిపేగా దానిని తుడిచి వేయడానికి వెళ్ళగా ఆ మార్క్ తుడిచినా పోకపోవడంతో ఇంతలో అక్కడికి వచ్చి అది ఇంత తుడిచినా కూడా పోదు జ్ఞానాంబ అని అంటాడు గోవిందరాజులు. ఆ తర్వాత వార్తలు గురించి మాట్లాడుతూ ఉంటారు.

మరొకవైపు రామచంద్ర కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానకి వస్తుంది. అప్పుడు రామచంద్ర జానకి తో నవ్వుతూ బాగా మాట్లాడతాడు. అప్పుడు జానకి అసలు విషయాన్ని పసిగట్టడంతో రామచంద్ర జానకిని హత్తుకుంటాడు. మరుసటి రోజు ఉదయం జ్ఞానాంబ పూజ చేస్తూ ఉండగా ఇంతలోనే జెస్సి నిద్ర లేచి హలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటుంది.

ఇంతలో మల్లిక అది చూసి ఎలా అయినా అత్తయ్యని రెచ్చ గొట్టాలి అని అక్కడికి వెళ్లి జెస్సి గురించి తప్పుగా చెబుతుంది. దాంతో కోపంతో రగిలిపోతున్న జ్ఞానాంబ అక్కడికి వచ్చి జానకి పై అరుస్తుంది. ఇంట్లో ఎవరికీ ఏం జరిగినా అన్ని బాధ్యతలు చూడాల్సింది నువ్వే అటువంటిది ఏంటి కట్టుబాట్లు నేర్పించాలి అని తెలియదా అని అంటుంది.

ఆ తర్వాత జానకి జెస్సిని లోపలికి పిలుచుకొని వెళ్లి పద్ధతిగా ఉండాలి అని నచ్చచెబుతుంది. అందుకు సరే అని అంటుంది జెస్సి. తర్వాత ఇంట్లో అందరూ భోజనం చేయడానికి కూర్చుంటుండగా ఇంతలో అక్కడికి జెస్సి అఖిల్ రావడంతో జ్ఞానాంబ లేచి వెళ్ళిపోతూ ఉంటుంది.

ఇంతలోనే అక్కడికి జెస్సీ తల్లిదండ్రులు రావడంతో జెస్సి సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు జెస్సీ తల్లిదండ్రులు రామచంద్ర ని జానకిని పొగుడుతూ ఉంటారు. అది చూసి మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది.