Actress Srivani : బుల్లతెర నటిగా ఎన్నో సీరియనల్స్ లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి శ్రీవాణి. తెలుగులో సీరియల్స్ చూసే ప్రతీ ఒక్కరికీ ఆమె సుపరిచితమే. అయితే మేడం అంతే అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా రోజుకో వీడియోతో ఎప్పటికప్పుడు తన భర్త, పాపతో కలిసి అల్లరి చేస్తుంటుంది. గలగల మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పే శ్రీవాణి గొంతు మూగబోయినట్లు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా వీడియోలలో ఈమె గొంతులో చాలా మార్పులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విధంగా వాయిస్ ఛేంజ్ అడంతో సాధారణ జలుబే అనుకొని ట్యాబ్లెట్లు వేస్కున్నారు. కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయేసరికి ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలోనే తాను ఇక మాట్లాడలేదనే విషయాన్ని గుర్తించారు.
Actress Srivani : మూగబోయిన బుల్లితెర నటి శ్రీవాణి గొంతు..
తనకు మాట పూర్తిగా రాకపోవడానికి కారణం.. గొంతు లోపల ఏదో ఇన్ఫెక్షన్ రావడమేనట. గట్టిగా మాట్లాడడం వల్ల అలా జరుగుతందని వైద్యులు సూచించారట. ఒక నెల రోజుల పాటు శ్రీవాణి మాట్లాడకుండా ఉంటేనే తనకు తిరిగి మాట వస్తుందని లేకపోతే తనకు జీవితంలో మాట రాదని వైద్యులు సూచింటినట్లు ఆమె భర్త విక్రమ్.. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు. అయితే శ్రీవాణికి తొందరగానే నయం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ కి గురయ్యారు. త్వరలోనే ఆమెకు మాట రావాలని కోరుకుంటున్నారు.