Manjula nirupam: షాపింగ్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది ఆడవాళ్లకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. అందులోనూ చీరలు, నగలు అంటే పిచ్చెక్కిపోతారు. ఎన్ని షాపులు, ఎన్ని గంటలు తిరిగినా వారికి ఏమాత్రం అలసట రాదు. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా కొత్తవి కొని ధరిస్తూ మురిసిపోతుంటారు. అందులోనూ సెలబ్రిటీలు అయితే ఓ మెట్టు పైనే ఉంటారు. జనాలకు బోర్ కొట్టకుండా నిత్య నూతనంగా కనిపించేందుకు తెగ ఆరాట పడుతున్నారు. ఈ క్రమంలో వారి షాపింగ్ చిట్టా కూడా చాలా పెద్దగానే ఉంటుంది. పండుగలు, ఫంక్షన్లు, పూజలు, పునస్కారాలు ఇలా ఏది వచ్చినా సరే చీరలు… వాటికి తగిన నగలు చేసుకునేందుకూ ఎప్పుడూ ముందుగానే ఉంటారు.
తాజాగా డాక్టర్ బాబు భార్య షాపింగ్ చేసేందుకు వెళ్లింది. సత్యనారాయణ వ్రతం ఉందంటూ ఆభరణాలు కొనుగోలు చేసింది. ఈసారి ఏకంగా ఏడు వారాల నగలు తన భర్తతో కొనుగోలు చేయించింది. కాకపోతే అవి పూర్తి బంగారంతో చేసినవి కావవు. 92.5 స్వచ్థమైన వెండి మీద బంగారం పూత పూసినవి. అంటే బంగారం లాంటి వెండిన నగలు. ఈ షాపింగ్ దెబ్బతో నిరుపమ్… అమ్మాయిలకు బట్టలు, నగలు పిచ్చి ఎప్పటికీ పోదంటూ కామెంట్ చేశాడు. మీరూ ఓ సారి ఈ వీడియోను చూసేయండి.