Narasimha Raju: విఠలాచార్య సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు నరసింహ రాజు. 1970లో అనేక విజయవంతమైన జానపద సినిమాల్లో హీరోగా నటించి ఆంధ్ర కమల్ హాసన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నరసింహరాజు నటించిన జగన్మోహిని అనే సినిమా ఘన విజయాన్ని సాఘించింది. దాదాపు 110 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన.. తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు.
వెండి తెరపై అవకాశాలు తగ్గిన సమయంలో బుల్లితెరపై కూడా నటించారు. సంపాదించిన డబ్బునంతా దాన ధర్మాల పేరిట పోగొట్టుకున్నారు. అయితే ఈయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె మెహదీ పట్నంలో అనేక కళాశాలలకు హెచఆర్ గా పని చేస్తుండగా.. కుమారుడు మాత్రం కెనడాలో సెటిల్ అయ్యాడు. తండ్రి హీరోగా సంపాదించింది ఏమీ లేకపోవడంతో కొడుకు సినిమాలకు దూరంగా ఉన్నాడు.
కెనడాలోనే సెటిల్ అయిన అతను 10 ఎకరాల గార్డెన్ తో పాటు రెండు ప్యాలెస్ లు కూడా కొనుగోలు చేశారట. ప్రతి వేసవి కాలంలో భార్యతో కలిసి నరసింహరాజు తన కొడుకు దగ్గరకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసి వస్తారట. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.