Komma Uyyala Kona Jampala – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com Telugu News : Live Updates Online on Andhra Pradesh, Telangana, Hyderabad, Politics, Crime, Sports, Cricket, Business, Education, Jobs, Entertainment, Technology, Health. Tufan9 Telugu covers Today’s breaking News, Top Headlines in Telugu Language Online Sat, 16 Apr 2022 17:48:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://tufan9.com/wp-content/uploads/2021/10/cropped-tufan9-favicon-32x32.png Komma Uyyala Kona Jampala – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com 32 32 Komma Uyyala : కొమ్మ ఉయ్యాలా… కోన జంపాల ఫుల్ సాంగ్ వచ్చేసింది…పాట ఎంత అద్భుతంగా ఉందో! https://tufan9.com/latest-telugu-news/komma-uyyala-kona-jampala-full-song-has-arrived-how-beauty-song-is.html Sat, 16 Apr 2022 13:51:03 +0000 https://tufan9.com/?p=13413 Komma Uyyala Full Video Song : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాలు టాలీవుడ్ టాప్ హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. భారీ బడ్జెట్ తో ఫాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ” కొమ్మ ఉయ్యాల కోన జంపాల” […]

The post Komma Uyyala : కొమ్మ ఉయ్యాలా… కోన జంపాల ఫుల్ సాంగ్ వచ్చేసింది…పాట ఎంత అద్భుతంగా ఉందో! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Komma Uyyala Full Video Song : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాలు టాలీవుడ్ టాప్ హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. భారీ బడ్జెట్ తో ఫాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ” కొమ్మ ఉయ్యాల కోన జంపాల” బాగా ఫేమస్ అయ్యింది.

Komma Uyyala Full Video Song
Komma Uyyala Full Video Song

ఈ సినిమాలో మల్లీ అనే చిన్నారి కొమ్మ ఉయ్యాల కోన జంపాల అంటూ మధురమైన గాత్రంతో పాట పాడుతూ తెల్ల దొరసానికి డిజైన్ వేస్తూ ఉంటుంది. చిన్నారి ప్రతిభ చూసి మంత్ర ముగ్ధురాలైన దొరసాని తిరిగి కోటకు వెళ్ళేటప్పుడు నిర్ధాక్షణ్యంగా చిన్నారిని తనతోపాటు లాక్కెళ్ళింది. ఈ సీన్ తో సినిమా ప్రారంభం అవుతుంది. ఈ పాట ప్రస్తుతం బాగా హిట్ అయింది. ఈ పాట మీద చాలామంది వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ పాటకు సంబంధించిన పూర్తి వీడియోనిఆర్ఆర్ఆర్ ఇటీవల విడుదల చేసింది. ఈ వీడియోలో చిన్నారి పాట పడిన తర్వాత దొరసాని తీసుకెళ్ళే దగ్గర నుండి చిన్నారిని జైలులో బందీగా చేసినది, చివరగా ఎన్టీఆర్ తనని భుజాలమీద ఎత్తుకుని తీసుకు వచ్చే వరకు అన్ని చూపించారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూ మంచి విజయాన్ని అందుకుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాట ఫుల్ వీడియో పై ఓ లుక్కేయండి.

Read Also : Ram Charan – Chiranjeevi: అస్సలు తగ్గను అంటూ తండ్రికే ఛాలెంజ్ విసిరిన రామ్ చరణ్..?

The post Komma Uyyala : కొమ్మ ఉయ్యాలా… కోన జంపాల ఫుల్ సాంగ్ వచ్చేసింది…పాట ఎంత అద్భుతంగా ఉందో! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
RRR Movie: కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా? https://tufan9.com/latest-telugu-news/do-you-know-the-singer-who-sang-the-song-komma-uyyala-kona-jampala.html Fri, 01 Apr 2022 13:07:07 +0000 https://tufan9.com/?p=11562 RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా మొదలవడమే మల్లీ పాత్రలో ఒక గిరిజన చిన్నారి పాడిన కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా అనే పాటతో మొదలవుతుంది. ప్రకృతి ఒడిలో పెరిగే ఆ చిన్నారి పాడిన ఈ పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పాలి.ఇలా ఈ సినిమాలో ఈ పాట ఎంతో అద్భుతంగా ఉండడంతో ఎంతో మంది ప్రేక్షకులు ఈ పాట పాడిన సింగర్ ఎవరు అని ఆరా తీస్తున్నారు.ఎంతో మధురమైన ఈ పాట […]

The post RRR Movie: కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా మొదలవడమే మల్లీ పాత్రలో ఒక గిరిజన చిన్నారి పాడిన కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా అనే పాటతో మొదలవుతుంది. ప్రకృతి ఒడిలో పెరిగే ఆ చిన్నారి పాడిన ఈ పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పాలి.ఇలా ఈ సినిమాలో ఈ పాట ఎంతో అద్భుతంగా ఉండడంతో ఎంతో మంది ప్రేక్షకులు ఈ పాట పాడిన సింగర్ ఎవరు అని ఆరా తీస్తున్నారు.ఎంతో మధురమైన ఈ పాట పాడిన ఆ చిన్నారి ఎవరు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం….

కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా అనే పాటను ఎంతో మధురంగా పాడిన సింగర్ పేరు ప్రకృతి రెడ్డి. ఈమె 2010 బళ్ళారిలో జన్మించారు.ప్రకృతి రెడ్డికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో మక్కువ ఉండటంతో అది గ్రహించిన ఆమె తల్లిదండ్రులు తనకు చదువుతోపాటు సంగీతంలో కూడా శిక్షణ ఇప్పించారు.ఇలా సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఎన్నో స్టేజ్ షోలలో తన అద్భుతమైన గాత్రంతో మధురమైన పాటలను ఆలపించిన ప్రకృతి రెడ్డి ఎంతో మంది ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ప్రవచనాలు, సంకీర్తనలు పాడుతూ మంచి గుర్తింపు పొందారు. అలాగే ఈ టీవీలో ప్రసారమయ్యే పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా పాటలు పాడి దివంగత ఎస్పీ బాలు మనసు దోచుకున్నారు. ఇలా సంగీతంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన ప్రకృతి రెడ్డి కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా పాటలు పాడుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇలా ఎన్నో స్టేజ్ షోలలో అద్భుతమైన నైపుణ్యాన్ని కనబర్చిన ప్రకృతి రెడ్డి 12 సంవత్సరాల వయసులోనే రాజమౌళి సినిమాలో పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకోవడంతో ఈ చిన్నారికి మంచి భవిష్యత్తు ఉంది అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు తన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

The post RRR Movie: కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>