Icon Star Allu Arjun – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com Telugu News : Live Updates Online on Andhra Pradesh, Telangana, Hyderabad, Politics, Crime, Sports, Cricket, Business, Education, Jobs, Entertainment, Technology, Health. Tufan9 Telugu covers Today’s breaking News, Top Headlines in Telugu Language Online Fri, 04 Feb 2022 12:17:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://tufan9.com/wp-content/uploads/2021/10/cropped-tufan9-favicon-32x32.png Icon Star Allu Arjun – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com 32 32 50 Days Pushpa Collections : 50 డేస్ కంప్లీట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప’… ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎంతంటే? https://tufan9.com/latest-telugu-news/50-days-pushpa-collections-allu-arjun-pushpa-movie-completed-50-days-and-collections-details.html Fri, 04 Feb 2022 10:27:24 +0000 https://tufan9.com/?p=7405 50 Days Pushpa Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” మూవీ మానియా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. టాలెండెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని… కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా… మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా చేశాడు. సునీల్, అనసూయ ప్రముఖ పాత్రలు పోషించగా… సమంత ఐటమ్ సాంగ్ లో దుమ్ము […]

The post 50 Days Pushpa Collections : 50 డేస్ కంప్లీట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప’… ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎంతంటే? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
50 Days Pushpa Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” మూవీ మానియా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. టాలెండెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని… కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా… మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా చేశాడు.

సునీల్, అనసూయ ప్రముఖ పాత్రలు పోషించగా… సమంత ఐటమ్ సాంగ్ లో దుమ్ము రేపింది. వరల్డ్ వైడ్ గా ఉన్న సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప మొదటి భాగం మంచి విజయం సాధించింది.

బాలీవుడ్ లో కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. సినిమా రిలీజ్ అయినా కొన్ని రోజులకే అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయినా థియేటర్స్ లో మాత్రం సందడి తగ్గలేదు. బాలీవుడ్ లో అయితే రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ‘పుష్ప’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో థియేటర్స్ లో అఖండ తర్వాత 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమా ‘పుష్ప’ మాత్రమే. చెప్పాలంటే ‘పుష్ప’ సినిమా తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా సక్సెస్ అయ్యింది. హిందీ ప్రేక్షకులు బన్నీ నటనకి ఫిదా అయిపోతున్నారు.

ఇక ఈ సినిమా లోని సాంగ్స్, డైలాగ్స్ ని రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయి 50 రోజులు పూర్తి అయిన సందర్భంగా మరోసారి ఇప్పటి వరకు ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ని అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ‘పుష్ప’ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

Read Also : Crime News : కట్టుకున్న భార్యని కడతేర్చిన కిరాతకుడు… షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి !

The post 50 Days Pushpa Collections : 50 డేస్ కంప్లీట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప’… ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎంతంటే? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Pushpa Official Trailer : ‘పుష్ప’ ట్రైలర్‌ వచ్చిందిగా.. తగ్గేదే లే… కేక పుట్టిస్తోంది! https://tufan9.com/latest-telugu-news/pushpa-official-trailer-allu-arjun-movie-pushpa-trailer-released-today.html Tue, 07 Dec 2021 03:05:59 +0000 https://tufan9.com/?p=3646 Pushpa Official Trailer : తెలుగు ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్ నటించిన అప్ కమింగ్ మూవీ పుష్ప అఫిషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. కొద్దిసేపటికే ట్రైలర్ కు ఫుల్ రెస్సాన్స్ వచ్చింది. నెట్టింట్లో పుష్ప ట్రైలర్ కేక పుట్టిస్తోంది. 2 నిమిషాల 31 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అడవిలో జరిగే సంఘటనలకు సంబంధించి తెరకెక్కించిన తీరు, అందులోని పాత్రలు […]

The post Pushpa Official Trailer : ‘పుష్ప’ ట్రైలర్‌ వచ్చిందిగా.. తగ్గేదే లే… కేక పుట్టిస్తోంది! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Pushpa Official Trailer : తెలుగు ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్ నటించిన అప్ కమింగ్ మూవీ పుష్ప అఫిషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. కొద్దిసేపటికే ట్రైలర్ కు ఫుల్ రెస్సాన్స్ వచ్చింది. నెట్టింట్లో పుష్ప ట్రైలర్ కేక పుట్టిస్తోంది. 2 నిమిషాల 31 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అడవిలో జరిగే సంఘటనలకు సంబంధించి తెరకెక్కించిన తీరు, అందులోని పాత్రలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందానే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బన్నీ అభిమానులు.. ఈ ట్రైలర్ లో నేపథ్య సంగీతం మరింత ఆకర్షణగా నిలిచింది. అల్లు అర్జున్ అభిమానులకు పుష్పతో ఫుల్ మిల్స్ దొరికినట్టే..

పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఒకే ఒక్క డైలాగ్.. తగ్గేదే లే.. ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘ఏయ్‌ బిడ్డా’, ‘దాక్కో దాక్కో మేక’ అనే నాలుగు పాటలు విడుదల అయ్యాయి. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌‌లో పాన్‌ ఇండియా స్థాయిలో పుష్పను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో ఐకాన్ స్టార్ సరసన రష్మిక నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్‌ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక సునీల్‌, అనసూయ కీ రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీని ముత్తంశెట్టి మీడియాతో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ రెండు పార్టులుగా నిర్మిస్తోంది. ‘ది రైజ్‌’ పేరుతో ఫస్ట్ పార్ట్ డిసెంబరు 17న రిలీజ్ కానుంది.

Read Also : Singer Chinmayi : సింగర్ చిన్మయిని గలీస్‌గా బూతులు తిట్టిన ఎన్నారైలు.. ఎందుకంటే?

The post Pushpa Official Trailer : ‘పుష్ప’ ట్రైలర్‌ వచ్చిందిగా.. తగ్గేదే లే… కేక పుట్టిస్తోంది! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Allu Arjun in Trouble : ఆ యాడ్‌లో చేసినందుకే ‘అల్లు అర్జున్‌’కు లీగల్ నోటీసులు.. ఆర్టీసీ ఎండీ సజ్జానార్ కీలక వ్యాఖ్యలు https://tufan9.com/latest-telugu-news/allu-arjun-in-trouble-tsrtc-to-send-legal-notice-to-allu-arjun-here-is-why.html Wed, 10 Nov 2021 19:25:35 +0000 https://tufan9.com/?p=3145 Allu Arjun in Trouble : టీఎస్ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ కేడర్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించాక తనదైన కొత్త ఆలోచనలతో ఆర్టీసీని కొత్త పంథాలో నడిపిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న చర్యల వల్లే దసరా పండుగ సమయంలో ఆర్టీసీకి మంచి కలెక్షన్లు వచ్చాయని పలు డిపోలకు చెందిన మేనేజర్లు సైతం చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ ఆర్టీసీ తరఫున లీగల్ నోటీసులను పంపించారు. కారణం ఆయన నటించిన […]

The post Allu Arjun in Trouble : ఆ యాడ్‌లో చేసినందుకే ‘అల్లు అర్జున్‌’కు లీగల్ నోటీసులు.. ఆర్టీసీ ఎండీ సజ్జానార్ కీలక వ్యాఖ్యలు appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Allu Arjun in Trouble : టీఎస్ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ కేడర్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించాక తనదైన కొత్త ఆలోచనలతో ఆర్టీసీని కొత్త పంథాలో నడిపిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న చర్యల వల్లే దసరా పండుగ సమయంలో ఆర్టీసీకి మంచి కలెక్షన్లు వచ్చాయని పలు డిపోలకు చెందిన మేనేజర్లు సైతం చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ ఆర్టీసీ తరఫున లీగల్ నోటీసులను పంపించారు. కారణం ఆయన నటించిన రాపిడో యాడ్ ప్రభుత్వ రంగ రవాణా సంస్థ ఆర్టీసీని కించపరిచేలా ఉండటమే. రాపిడో సంస్థకు కూడా నోటీసులు పంపించినట్టు సజ్జనార్ పేర్కొన్నారు.

ఈ యాడ్ పట్ల ఆర్టీసీ ఎండీ సీరియస్ అవ్వడానికి, హీరో అల్లు అర్జున్‌కు నోటీసులు పంపడానికి అందులో అంతగా ఏముందని అందరికీ అనుమానం రావొచ్చు. దీనికి వెనుక గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాపిడో ప్రకటన ఆరంభంలో అల్లు అర్జున్ టిఫిన్ సెంటర్‌లో దోశలు వేస్తూ కనిపించగా.. ఆర్టీసి బస్సులో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడుతూ ప్రయాణిస్తుంటారు.

ఒక్కొక్కరు చెమటలు కక్కుతూ టిఫిన్ సెంటర్ ముందు దిగుతుంటారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును నమ్ముకుంటే డబ్బులు పోగా, ఒళ్ళంతా హూనం అవుతుందనే అర్థం వచ్చేలా అల్లు అర్జున్ కామెంట్స్ ఉంటాయి. అనవసరంగా ఈ బస్ ఎక్కి ఒళ్ళు హూనం చేసుకునే బదులు ‘రాపిడో’ బుక్ చేసుకుని హాయిగా షర్ట్ నలగకుండా మీరు నచ్చిన చోటుకు వెళ్లిపోండని చెప్తాడు. ఈ యాడ్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

సెలబ్రిటీ అయ్యుండి ఇటువంటి వాణిజ్య ప్రకటనలు ఎలా చేస్తారంటూ సజ్జనార్ ప్రశ్నించారు. ఈ యాడ్ ముమ్మాటికీ ఆర్టీసి ప్రతిష్టను దిగజార్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందువల్లే అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపించినట్టు సజ్జనార్ తెలిపారు. మెరుగైన సమాజం కోసం సెలబ్రిటీలు ప్రజా రవాణాను ప్రమోట్ చేయాలి గానీ ఇలా పరువు తీసేవిధంగా యాడ్స్ చేయరాదని సజ్జనార్ సీరియస్ అయ్యారు.
Read Also :  Pawan Kalyan : ‘చిరు’ సూపర్ హిట్ మూవీ రీమేక్‌లో తమ్ముడు ‘పవన్ కళ్యాణ్’.. అన్ని కుదిరితే ఫ్యాన్స్ పండగే!

The post Allu Arjun in Trouble : ఆ యాడ్‌లో చేసినందుకే ‘అల్లు అర్జున్‌’కు లీగల్ నోటీసులు.. ఆర్టీసీ ఎండీ సజ్జానార్ కీలక వ్యాఖ్యలు appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>