CM KCR : దాదాపు 8 నెలల విరామం తర్వాత సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లారు. 2021 అక్టోబర్ 11వ తేదీన అక్కడికి సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం కోసం రాజ్ భవన్ వెళ్లిన కేసీఆర్… ఆ తర్వాత రాజ్ భవన్ వైపు వెళ్లలేదు. తాజాగా ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. చాలా కాలంగా గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ మధ్య విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని, కనీసం తల్లి మరణిస్తే కూడా సీఎం కేసీఆర్ పలకరించలేదని గవర్నర్ తమిళిసై గతంలో కామెంట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
తాజాగా సీజే ప్రమాణ స్వీకారం కోసం ముఖ్యమంత్రి రాజ్ భవన్ కు వచ్చారు. గవర్నర్, సీం ఒకరినొకరు పుష్పగుచ్ఛాలతో గౌరవించుకున్నారు. అయితే వారిద్దరి మధ్య సమావేశం సాఫీగా సాగిందని. సహృద్భావ వాతావరణంలోనే జరిగిందని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత తేనీటి విందులోనూ ఇరువురూ సంతోషంగా ఉన్నారు.
Read Also : PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన పథకం కింద 2 వేలు పొందాలంటే ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి …?