Yogini ekadashi : హిందూ సంప్రదాయాల ప్రకారం ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే ఏకాదశి ప్రతి నెలలో రెండు సార్లు వస్తుంది. అయితే మొదటిది కృష్ణ పక్షంలో, రెండవది శుక్ల పక్షంలో ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు. అయితే ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. యోగిని ఏకాదశి ఈసారి జూన్ 24వ తేదీన జరుపుకోనున్నారు. యోగిని ఏకాదశి చాలా ప్రత్యేకమైనదని.. ఈ రోజు మేమిప్పుడు చెప్పబోయే పద్ధతిలో పూజ చేస్తే చాలా లాభాలు ఉంటాయి. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యోగిని ఏకాదశి తర్వాత దేవశయని ఏకాదశిని జపురుకుంటారు. దేవశయని ఏకాదశి నుంచి 4 నెలల పాటు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. అందుకే యోగినీ ఏకాదశిని చాలా ముఖ్యమైందిగా భావిస్తారు. ఇది కాకుండా యోగిని ఏకాదశిని నిర్జల ఏకాదశి. దేవశయని ఏకాదశి వంటి ముఖ్యమైన ఏకాదశి మధ్యలో వస్తుంది. దీని వల్లే యోగిని ఏకాదశికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంది.
జూన్ 24వ తేదీ అంటే రేపే యోగిని ఏకాదశి వస్తోంది. శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేస్కుంటే చాలా లాభాలు కల్గుతాయి. ఖాదశి తిథి జూన్ 23 గురువారం రాత్రి 9.41 గంటలకు ప్రారంభమై.. శుక్రవారం రాత్రి 11.12 గంటల వరకు కొనసాగుతుంది. జూన్ 25వ తేదీ శనివారం ఉదయం ఉపవాస దీక్ష విరమిస్తారు. యోగినీ ఏకాదశి రోజు తెల్లవారుజామున స్నానం ఆచరించి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిని విధిగా పూజించండి. భగవంతునికి పండ్లు, పువ్వులు సమర్పించండి. నిజమైన భక్తితో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తి దయతో, మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అదే సమయంలో లక్ష్మీ మాత అనుగ్రహంతో సంపదలు నిండుతాయి. ఆర్థిక రంగంలో శ్రేయస్సు పెరుగుతుంది.
Read Also : Ashoka tree root: ఈ చెట్టు వేరును మీ ఇంట్లో పెట్టుకున్నారంటే… కోటీశ్వరులు అవ్వాల్సిందే!