Janaki Kalaganaledu April 14th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు స్టార్ మాలో ప్రసారం అవుతూ విశేష ప్రేక్షకాదరణ పొంది అద్భుతమైన రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ కు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా జానకి తన అన్నయ్య యోగిని పిలిచి తన అత్తయ్య పై కేసు పెట్టినందుకు తనని నిలదీస్తుంది. తాను చేసిన తప్పుకు తన అత్తయ్యను క్షమాపణలు కోరాలని చెబుతుంది. పెళ్లిలో పెద్ద అబద్ధం చెప్పి నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు మా అత్తయ్య పై కేసు పెట్టి మరో తప్పు చేసి నన్ను ఇబ్బందులలో పెట్టావు అంటూ తన అన్నయ్యను నిలదీస్తుంది.
జానకి ఇలా నిలదీయడంతో తన అన్నయ్య నేనేం చేసినా నీ సంతోషం కోసమే. నిన్ని ఈ ఇంటికి ఇస్తే ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటావని అబద్ధం చెప్పాను. ప్రస్తుతం నీ సంతోషం కోసమే మీ అత్తయ్య అన్ని బాధలు పెట్టడం చూడలేకే తనపై పోలీసు కేసు పెట్టానని చెబుతాడు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని చెబుతాడు. ఇప్పుడు మీ అత్తయ్య నిన్ను ఆ ఇంట్లోకి తిరిగి పిలుచుకుంటాను అంటే నేను తన కాళ్ళపై పడి క్షమాపణలు కోరతా అని యోగి చెప్పడంతో జానకి ఎంతో సంతోషించి తన అన్నయ్యతో కలిసి తన అత్తయ్య దగ్గరకు వెళ్తారు.
స్వీట్ షాప్ దగ్గరకు జానకి తన అన్నయ్య, యోగి వెళ్ళడం చూసిన జ్ఞానాంబ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వారిని చూసి చూడనట్టు పక్కకు వెళ్లడంతో మీతో మాట్లాడాలి అని జానకి అనగా. ఏం కావాలి ఏం స్వీట్స్ కొంటారు అంటూ జ్ఞానాంబ అడుగుతుంది. మీరు క్షమించడం కావాలి అని యోగి అనడంతో చేతిలో ఉన్న స్వీట్ డబ్బాను కోపంతో విసిరి కొడుతుంది. అలా జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లడంతో యోగి తన కాళ్ళు పట్టుకొని తనని క్షమించమని కోరుతాడు.
ఇక ఇందులో నీ తప్పు ఏమీ లేదు కర్త, కర్మ, క్రియ అన్నీ నీ చెల్లెలు జానకి అనే విషయం నాకు తెలిసిందే.నా కూతురు పెళ్లి విషయంలో నన్ను మోసం చేసి నా పరువు తీసింది. ఇప్పుడు నన్ను జైలుకు పంపించి మరోసారి నా పరువు తీసింది అంటూ జ్ఞానంబా కోపడుతుంది.ఇక నిన్ను అయినా క్షమిస్తానేమో కానీ నీ చెల్లెలిని ఎప్పటికీ క్షమించను అంటూ గట్టిగా సమాధానం చెబుతుంది. ఇలా జ్ఞానాంబ జానకిని తిట్టి పంపిస్తుంది. ఇక ఆ రోజు రాత్రి పడుకుని ఉండగా జ్ఞానాంబ తన కొడుకు గురించి ఆలోచిస్తూ వంట చేస్తుండగా గ్యాస్ మంటలు చెలరేగిన మంటలు చిక్కుకున్నట్టు రామా కలగంటాడు.
ఇలాంటి కల రావడంతో వెంటనే తేరుకొని వెళ్లి అర్ధరాత్రి సమయంలో జ్ఞానాంబ ఇంటి తలుపు కొడతారు. విష్ణు వెళ్లి తలుపు తీయి అని జ్ఞానాంబ చెప్పగా రామ కంగారుగా వెళ్లి తన తల్లిని చూసి నీకు ఏం కాలేదు కదా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయినా నాకేం అవుతుంది ఈ అర్ధరాత్రి ఏంటి గోల బయటకు పంపించండి అని విసుక్కుంటుంది. జానకి మాత్రం లోపలికి వెళ్లకుండా గడప వద్దే ఉంటే మల్లిక ఇది కూడా జానకి ప్లాన్ అంటూ మరింత ఆజ్యం పోస్తుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తి కాగా తరువాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
Read Also : Janaki Kalaganaledu: జానకిని క్షమించమని కోరిన రామచంద్ర.. జానకిని తప్పుగా అపార్థం చేసుకున్న జ్ఞానాంబ..?