Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
సౌర్య, సత్యాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి గుడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే సత్య తో కలిసి హాస్పిటల్ లో మాట్లాడుతూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య కార్ లో వెళ్తూ కార్తీక్, దీప ల పేరు మీద అన్నదానం చేయించాలి అని అనుకున్నాను. ఇంతలో ఆయన హాస్పిటల్లో పడ్డారు అని ఆలోచించుకుంటూ గుడికి వెళుతుంది.
అదే సమయానికి జ్వాలా, ఇంద్రమ్మ దంపతులు గుడిలో పూజలు చేయిస్తూ ఉంటారు. ఈ రోజు అన్నదానం నేనే చేయిస్తాను అంటూ అన్నదాన కార్యక్రమానికి డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత జ్వాల పూజారి దగ్గరికి వెళ్లి చనిపోయిన మా అమ్మానాన్నలకు పేరుమీద అన్నదానం జరిపించాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్య చనిపోయిన నా కొడుకు కోడలి పేరుమీద అన్నదానం చేయించండి పూజారి గారు అని చెప్పగా అప్పుడు పూజారి ఇప్పుడే ఆ పేర్ల మీద ఒక అమ్మాయి అన్నదానం జరిపించాలి అని చెప్పి వెళ్ళింది అని అనడంతో సౌందర్య ఆనందపడుతుంది.
వెంటనే పూజారిని అడిగి జ్వాలా కి సంబంధించిన వివరాలను అడుగుతుంది. జ్వాలా ఎవరో కాదు సౌర్య అన్న విషయాన్ని సౌందర్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంటికి వెళ్లిన సౌందర్య సౌర్య సిటి లోనే ఉంది అని ఆనందరావుకి చెప్పగా, అప్పుడు ఆనందరావు మన పై కోపంతో కావాలనే తప్పించుకొని తిరుగుతుంది అనుకుంటాను అని అంటారు.
మరొకవైపు సినిమా, నిరుపమ్ మాట్లాడుకుంటూ హాస్పిటల్ లో జరిగిన విషయం గురించి చర్చించుకుంటూ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు నిరుపమ్ మాట్లాడుతూ ఆటో అమ్మాయిని చూస్తే ఎందుకో నాకు సౌర్య లా అనిపిస్తోంది అని హిమ తో అంటాడు.
అప్పుడు హిమ నా మనసులోని మాటలు చెప్పావు బావ అని అంటుంది. నాకు కూడా ఆ అమ్మాయిని చూస్తే సౌర్య లాగే అనిపిస్తుంది అని అంటుంది. ఇంతలోనే నిరుపమ్,హిమ మాట్లాడుతుండగా సౌర్య అక్కడికి వస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..