Shani jayanthi : శని అనుగ్రహం కోసం రకరకాల పూజలు చేస్తుంటారు చాలా మంది. జీవితంలో వచ్చిన సమస్యలు తొలగిపోవాలని, కష్టాలు, నష్టాలు వదిలి వెళ్లి పోవాలని.. జీవితం సాఫీగా ఆనందంగా గడపాలని శనీశ్వరుడిని ఆరాధిస్తారు. శనీశ్వరుడికి ఇష్టమైన రోజున, పూజలతో పాటు నలుపు వస్తువులను దానం చేస్తారా చాలా మంది. హిందూ మత సాంప్రదాయంలో ధాన ధర్మాలకు ప్రత్యేక స్థానం ఉంది. దానం చేసే వారిని శని దేవుడి అత్యంత ప్రియమైన వారిగా భావిస్తాడని నమ్మకం ఉంది.
దేవతల్లో శనీశ్వరుడి స్థానం ప్రత్యేకమైనది. సనాతన ధర్మంలో దేవాతారాధన ఎంతో ముఖ్యమైనది అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. దేవదేవతలు అనుగ్రహం పొందేందుకు వివిధ రకాల పూజలు చేస్తుంటారు. జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ దేవతారాధన చేస్తుంటారు. మనశ్శాంతి కోసం గుళ్లకు వెళ్లి దేవుళ్లను పూజిస్తారు. అయితే.. దేవతల్లో కెల్లా శనీశ్వరుడి స్థానం ప్రత్యేకమైనది. ఎందుకంటే శని అనగానే మనలో చాలా మందికి గుర్తుకు వచ్చేది చెడు. జీవితం అల్లకల్లోలంగా సాగుతుంటే శని ప్రభావం ఉందని భావిస్తాం. కష్టాలు, నష్టాలు చుట్టుముడితే శని దాపురించిందని మదన పడి పోతుంటాం. ఇలా శనీశ్వరుడికి కోపం వస్తే.. మన జీవితంలో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.
ఈ ఏడాదిలో శని జయంతి ఈ నెలలోనే వస్తోంది. మే 30వ తేదీన సోమవారం శని జయంతి వస్తుంది. శని దేవుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా పవిత్ర మైనదిగా భావిస్తారు. శని జయంతి రోజున తెల్లవారుజామునే తలస్నానం చేయాలి. ముందు ఆవాల నూనెతో మర్దన చేసి తలస్నానం చేయాలి. ఉదయమే తలస్నానం చేసి ఆవ నూనెతో వంటకాలు సిద్ధం చేసుకోవాలి. ఆయా వంటకాలను శని పూజలో ప్రసాదాలుగా సమర్పించాలి. నల్ల నువ్వులు, ఆవ నూనె దీపం, ఇతర వస్తువులతో పూజను నిర్వహించాలి. ప్లేట్ తో గుడికి వెళ్లి శని దేవుడికి సమర్పించండి. ఆ రోజు శని చాలీసాను పఠించాలి.
Read Also : Shani Trayodashi: నేడే శని త్రయోదశి… ఈ వస్తువులు దానం చేస్తే అంతా శుభమే?
Devotional Tips : శని ప్రభావం మన ఇంటిపై ఉండకూడదు అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క ఉండాల్సిందే!
Shani Jayanthi : శని దోషం తొలగిపోవాలంటే శని జయంతి రోజున ఈ పరిహారం చేస్తే చాలు..?