Guppedantha Manasu june 20 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. కుటుంబం కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కి యువత సైతం అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం ఈ సీరియల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగింది. సాక్షి లైబ్రరీలో లాక్ చేసుకుని రిషిని పెళ్లి చేసుకుంటావా లేదా అని బెదిరించిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా తనని పెళ్లి చేసుకోమని లేకపోతే ఫైర్ అలారం నొక్కితే కాలేజ్ మొత్తం ఇక్కడికే వస్తారు. అప్పుడు నువ్వు నన్ను ఏదో చేసావ్ అని అందరి ముందు చెబితే నీ పరువు మొత్తం పోతుంది. ఒప్పుకో రిషి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకో అని బెదిరిస్తుంది. సాక్షి ఈ విధంగా బెదిరించినప్పటికీ రిషి మౌనంగా ఉండిపోతాడు. సాక్షి బెదిరింపులకు రిషి సమాధానం చెప్పకపోయేసరికి కోపంతో అలారం నొక్కుతుంది.అదే సమయంలో కాలేజ్ నుంచి వెళ్తున్న జగతి మహేంద్ర స్టూడెంట్స్ అందరూ కూడా భయంతో లైబ్రరీ వైపు పరుగులు పెడతారు.
అందరూ వచ్చి బయట తలుపులు కొడుతుంటారు. రిషి ఏం చేయాలో దిక్కుతోచక ఖంగారు పడుతుంటారు. అప్పటికి సాక్షి తన మాటలతో రిషిని ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ మాట్లాడగా సీన్ లోకి వసుదార ఎంట్రీ ఇస్తుంది.లైబ్రరీలో వసును చూసి సాక్షి ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వసును లైబ్రరీలో చూసేసరికి రిషి సైతం ఆశ్చర్యపోతూ తను ఇక్కడ ఏం చేస్తుందని ఆశ్చర్య పోతాడు.వసుధార సాక్షి దగ్గరకు వెళ్లి సర్ జోలికి వస్తే ఊరుకునేది లేదు ఏదో చేస్తాను అన్నావు కదా ఏం చేస్తావో చెయ్యి అని వార్నింగ్ ఇస్తుంది.
అందరూ వచ్చి అడిగితే నేను నిజం చెప్పేస్తాను అని బెదిరిస్తుంది.నువ్వే వెళ్లి డోర్ ఓపెన్ చెయ్ అని చెప్పగా సాక్షి వెళ్లి డోర్ తీయగా జగతి మహేంద్ర తనని అక్కడ చూసి షాక్ అవుతారు. ఏం జరిగింది అంటూ సాక్షి రిషిని అడుగుతారు. సాక్షి కంగారు పడుతూ ఉండగా మధ్యలోకి వసుంధర ఎంట్రీ ఇచ్చి కట్టు కథలు చెబుతుంది. దీంతో సాక్షికి దిమ్మతిరుగుతుంది. అనంతరం వసుధార రిషి అక్కడ జరిగినది తలచుకుంటారు. ఇక వసు ఇంటికి వెళ్తుండగా.. సాక్షి అడ్డుపడి తనపై గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇస్తుంది. వసుధార కూడా ఏ మాత్రం తగ్గకుండా సాక్షికి వార్నింగ్ ఇస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి కాగా తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
Read Also : Guppedantha Manasu june 16 Today Episode : రిషి గురించి బాధ పడుతున్న వసుధార.. వసుకీ థాంక్స్ చెప్పిన రిషి ..?