Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి మహేంద్ర తో మీరు ఏదో ఊహించుకోకండి.. జస్ట్ అలా సరదాగా పార్టీ ఇవ్వాలి అనుకున్నాను అని అంటాడు. ఇక రిషి పార్టీ ఇప్పుడు వద్దులే.. అంటాడు. ఎందుకంటే వీళ్లు అక్కడికి వచ్చి ఏదో ఒక ప్రశ్నలు తో విసిగిస్తారు. కాబట్టి రిషి పార్టీ క్యాన్సిల్ చేస్తాడు.
ఆ తర్వాత వసు రిషి కు తన బొమ్మను వాట్సాప్ లో షేర్ చేస్తుంది. అంతేకాకుండా మనం ఒకసారి కలవాలి ఇక రెస్టారెంట్ తలుపులు తెరిచే ఉంటాయి అని టెక్స్ట్ పెడుతుంది. ఆ తర్వాత.. రిషి వసు లేకుండా తన కళ్ళ ను ఇంత బాగా ఎలా గీయగలిగాను అని ఆలోచిస్తూ ఉంటాడు.
మరో వైపు దేవయాని నీ లుక్స్ తో నీ నవ్వుతో రిషి మనసులో సంపూర్ణంగా ప్రేమ కనపడాలి అని సాక్షి కి చెబుతుంది. ఆ తర్వాత రిషి వసు పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తాడు. ఇక సాక్షి కూడా అదే రెస్టారెంట్ కి వెళుతుంది. అక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి.. రిషి ఏంటి చీప్ గా దీంతో తిరుగుతున్నాడు అని అనుకుంటుంది.
ఇక సాక్షి రిషి దగ్గరికి వెళ్లి కూర్చోగా.. రిషి వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళి పోతాడు. ఇక కోపంతో సాక్షి వసును చిటికేసి మరీ.. ఏయ్ అని పిలుస్తుంది. ఆ క్రమంలో సాక్షి వసును అవమాన పరిచేలా మాట్లాడుతుంది. ఇక వసు ఏ మాత్రం తగ్గకుండా సాక్షి కి తగ్గట్టుగానే సమాధానం చెబుతుంది.
ఆ తర్వాత రిషిను వసు ఒకచోట కలిసి ఐ లవ్ యు సార్ అని చెబుతోంది. దాంతో ఒక్కసారిగా రిషి మనసులో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తాడు. కానీ వసు ఐ లవ్ యు మేటర్ చెబుతా అని అంటుంది. ఇక రిషి నిరాశ పడక తప్పదు. ఇక వసు చున్నీ కారు లో ఇరుక్కుపోతుంది. రిషి ఆ చున్నీ ని బయటకు తీస్తాడు.
ఆ క్రమంలో రిషి వసులు ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఇక తరువాయి భాగం రిషి లెటర్ చూసి ఆలోచిస్తూ ఉండగా.. మహేంద్ర అది గమనిస్తాడు. అంతే కాకుండా రిషి కి తెలియకుండా జగతి ను ఆ గదిలోకి తీసుకు వచ్చి ఆ లెటర్ ను తనకి చూపిస్తాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World