...

Intinti Gruhalakshmi: కలెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రవల్లిక.. షాక్ లో తులసి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మదర్ తెరిసా ఫౌండేషన్ కు తులసి కుటుంబం అక్కడికి వెళ్తారు. అక్కడ ప్రవళిక తో కలిసి మాట్లాడుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి, ప్రవల్లిక వాళ్లు మాట్లాడుతూ ఉండగా ఇంతలో నందు వాళ్ళు వస్తారు. తులసి ని చూసినా లక్కీ వెంటనే వెళ్లి తులసి హత్తుకుంటాడు.అప్పుడు లాస్య వచ్చి నిన్ను హాస్టల్ నుంచి పిలుచుకొని వచ్చింది నా దగ్గర ఉండడానికి తులసి దగ్గర ఉండడానికి కాదు అని అనడంతో, అప్పుడు లక్కీ నాకు తులసి ఆంటీ అంటే ఇష్టం, నీకు మాట్లాడాలని లేకపోతే మాట్లాడొద్దు మమ్మీ అని అనడంతో లాస్య లక్కీని కొట్టబోతుండగా తులసి అడ్డుపడుతుంది.

ఆ తరువాత వారి విషయంలో కి ప్రవళిక కలుగజేసుకొని ఆ చిన్న పిల్లాడికి మీ దగ్గర దొరకని ఆప్యాయత ఏదో తులసి దగ్గర దొరుకుతుంది అందుకే వాడు ఇష్టపడుతున్నారు. కాబట్టి మొదట మారాల్సింది మీరు.. తులసి కాదు అని అనడంతో లాస్య అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది.

ఇంతలో ప్రేమ్, అభి లు కలిసి రావడం చూసి తులసి సంతోషపడుతుంది. కానీ ప్రేమ్ ని మాత్రం దూరం పెడుతుంది తులసి. అప్పుడు ప్రవళిక అది న్యాయం కాదు అని చెప్పినా కూడా తులసి వినకుండా అలాగే ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత ఈవెంట్ మొదలైన తరువాత తల్లీ పిల్లల మధ్య ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి పరీక్ష పెడతారు.

ఆ తర్వాత నందు వెళ్లి అనసూయకు మదర్స్ డే అని చెప్పడంతో అప్పుడు అనసూయ కేవలం మదర్స్ డే రోజు మాత్రమే గౌరవించడం కాదు జీవితాంతం ప్రేమగా చూసుకోవాలి అని అంటుంది. ఆ మాటకు నందు బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మదర్స్ డే ఈవెంట్ లో భాగంగా లాస్య వాళ్ళ దగ్గరికి వెళ్లిన యాంకర్ మీ బాబు కి ఇష్టమైన ఫుడ్ ఏమిటి అని అడగగా, అప్పుడు లాస్య ఆలోచిస్తూ ఉండగా ఇంట్లో తులసి పాస్త అని చెప్పడంతో లక్కీ కరెక్ట్ మీరు సూపర్ ఆంటీ అని అంటారు.

ఆ తర్వాత ప్రేమ్ కి ఇష్టమైన వ్యక్తి ఎవరు అని తులసిని ప్రశ్నించగా అమ్మ అని కరెక్ట్ గా సమాధానం చెబుతుంది తులసి. ఇక ఆ తర్వాత అందరూ కలిసి తులసిని బెస్ట్ మొదటగా ఎంచుకోగా ఇంతలో అక్కడ ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన ఆవిడ ఎలా బెస్ట్ మదర్ అవుతుంది అని అనడంతో తులసి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తరువాత ప్రవళిక కలెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడంతో ప్రతి ఒక్క సారిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.