Weekly horoscope : ఈ వారం అనగా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి.. మేష రాశి వాళ్లకు సంపూర్ణ విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో పని పూర్తి చేయండి. మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అందరి ప్రశంసలను అందుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగంలో పైఅధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారంలో బాగుంటుంది. ఊహించిన దానికంటే మంచి ఫలితాలే వస్తాయి. ధనయోగం అధికంగా కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు సేవ్ చేస్కోండి. ఏవైనా పెట్టుబడులు వంటివి పెడితే మరింత మంచిది. వాదోపవాదాలకు తావివ్వకండి. కొందరు ఈర్ష్య పడతారు. కుజశ్లోకం చదవండి, శుభం జరుగుతుంది.
మిథున రాశి.. మిథున రాశి వాళ్లకు శ్రేష్ఠమైన కాలం. అభీష్ట సిద్ధీ, అనేక శుభ యోగాలూ ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. ఆపదలు తొలగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. దానధర్మాలు చేసే అవకాశం లభిస్తుంది. గృహ, భూ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏం కొనుక్కోవాలనుకున్న వారైనా ఈ వారంలో కొనుగోలు చేయడం మంచిది. ఇష్ట దేవతను స్మరించండి. శుభవార్త వింటారు.