Horoscope: ఈరోజు అనగా జులై 22వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లకు ఈ రోజంతా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మేష రాశి.. ఈ రాశి వాళ్లకు ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అనవసర కలహ సూచితం. కాబట్టి ఎవరైమా మిమ్మల్న ఒక మాట అన్నా పెద్దగా పట్టించుకోకండి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు చాలా దురంగా ఉండాలి. శని శ్లోకం చదివితే శుభ ఫలితాలు కల్గుతాయి.
వృషభ రాశి.. మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కల్గిస్తాయి. కలహ సూచన కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.