Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్వాలా తనని నిరూపమ్ పొగిడినందుకు ఆనంద పడుతూ ఉంటుంది. మరొక వైపు నిరూపమ్ కూడా కారు నడుపుతూ జ్వాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా వెళుతూ వెళుతూ సౌర్య ఆటోని క్రాస్ చేస్తాడు. మరొక వైపు సినిమా జ్వాలా ని పరిచయం చేసుకుంటే హిమను వెతకమని చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
అలా కొద్దిసేపు కారులో నిరూపమ్, హిమ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. మరొకవైపు సౌందర్య, ఆనందరావుకి బాగాలేదు అని చెప్పడానికి కూతురు స్వప్న ఇంటికి వెళుతుంది. అక్కడికి వెళ్ళి జరిగినదంతా వివరిస్తుంది. కానీ స్వప్న మాత్రం కఠినంగా సౌందర్యను అవమానించే విధంగా మాట్లాడుతుంది.
మీ డాడీ కి బాగోలేదు అని సౌందర్య చెప్పగా తెలుసు అని అంటుంది స్వప్న. మరి తెలిసి కూడా ఎందుకు రాలేదు అని సౌందర్య అడగగా, అక్కడ నువ్వు ఉంటావని నేను రాలేదు అని కఠినంగా చెబుతుంది స్వప్న. ఇంతలో నిరూపమ్ వచ్చి అమ్మ అన్నం పెట్టావా అని అడగగా ఉండు ఇంటికి వచ్చిన పెద్దమనిషి వెళ్ళని ఆ తర్వాత పెడతా అని అంటుంది.
అప్పుడు నిరూపమ్ అమ్మమ్మ ఇకపై మీరు ఇక్కడికి రావద్దు అని చెబుతాడు. ఎప్పుడైనా నన్ను చూడాలి అనిపిస్తే ఫోన్ చేయండి నేను మీ దగ్గరికి వస్తాను అని అనడంతో సౌందర్య అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతుంది. సౌందర్య తన మనసులో నిరూపమ్ అయితే హిమ కి కరెక్ట్ గా సూట్ అవుతాడు అని అనుకుంటుంది.
మరోవైపు శౌర్య ఇంద్రమ్మ ను హాస్పిటల్ కి తీసుకుని వెళుతుంది. అప్పుడు నిరూపమ్ ఫీజుకు బదులుగా హిమకి ధైర్యం నేర్పించమని జ్వాలని కోరుతూ, ఆమెను పొగుడుతాడు.అప్పుడు జ్వాల ఆనందంతో మురిసిపోతుంది. మరోవైపు హిమ జ్వాలా ని చూస్తుంటే నాకు సౌర్య నే గుర్తుకు వస్తుంది అని నిరూపమ్ తో అంటుంది.రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..