Devatha june 2 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సత్య తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని రాధతో చెప్పి ఎమోషనల్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో మాధవ,రాధ చేసిన పనిని తలచుకుని ఎందుకుర రాధ ఈ విధంగా చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా అయినా రాధకు తాను తప్ప వేరే మార్గం ఉండకూడదని అందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తూ అమ్మ సెంటిమెంట్ తో రాధ ను మరింత ఉక్కిరి బిక్కిరి చేయాలి అని ప్లాన్ చేస్తాడు మాధవ.

Devatha june 2 Today Episode
మరొకవైపు దేవీ, రాధ ఇద్దరూ పొలం వైపు నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అప్పుడు దేవి అమ్మ నీకు పొలం పనులు ఎవరు నేర్పించారు నీకు వచ్చా అని అడగగా.. తాను గతంలో చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకొని తాను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను అని చెబుతుంది. ఇంతలో భాగ్యమ్మ ఎదురు రావడంతో అప్పుడు దేవి అమ్మమ్మ అని గట్టిగా పిలుస్తుంది.
ఇక సంతోషపడిన భాగ్యమ్మ దేవిని చూసి ఎమోషనల్ అవ్వగా ఇప్పటినుంచి అలాగే పిలుస్తాను అని అంటుంది దేవి. అప్పుడు దేవి పక్కకు వెళ్లి మామిడికాయ తింటూ ఉండగా అప్పుడు భాగ్యమ్మ రాధతో నీ బిడ్డ నన్ను అమ్మమ్మ అని పిలిచింది అందుకు నాకు సంతోషంగా ఉంది అని చెబుతుంది. అప్పుడు భాగ్యమ్మ అక్కడ ఎలా ఉన్నావు రాధమ్మ అని అడగగా అప్పుడు రాధ జరిగిన విషయాన్ని భాగ్యమ్మ కు చెబుతుంది.
అంతే కాకుండా దేవి తన తల్లి కాదు అని అనింది అన్న మాట కూడా చూపిస్తుంది రాద. అప్పుడు భాగ్యమ్మ కాస్తా ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు ఆదిత్య సత్య మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఆదిత్య నిన్న ఎక్కడికి వెళ్ళావు కదా అని అడగగా రాధా అక్క దగ్గరికి వెళ్లి నా బాధలు చెప్పుకున్నాను అని అంటుంది సత్య.
అప్పుడు వెంటనే ఆదిత్య ఆ రాధే మీ అక్క రుక్మిణి అని తెలిసి అక్కడికి వెళ్లావు కదా తెలిసి కూడా తెలియనట్టు ఉన్నావ్ కదా అని అనడంతో సత్య షాక్ అవుతుంది. తెలుసు అంటున్నావు నీకు కూడా తెలుసు అని సత్య ఆదిత్య అడగడంతో అవును అని అంటాడు ఆదిత్య. ఆ మాటకు సత్య మరింత షాక్ అవుతుంది.
అలా వారిద్దరూ కొద్దిసేపు రాధ గురించి బాధ పడుతూ ఉంటారు. మరొకవైపు రాధను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి మాధవ ప్లాన్ లు వేస్తూ ఉంటాడు. సత్య, ఆదిత్యకు నిజం తెలిసినా కూడా ఎందుకు ఈ విధంగా ఉంటున్నారు అని ఆలోచిస్తూ బాధపడుతుంది.
జానకి ఇంట్లో పనులు చేస్తూ ఉండగా రాదా వచ్చి నేను చేస్తాను కదా అని అనగా ఈ ఇంటికి వచ్చే కోడలు ఏ విధంగా ఉంటుందో తెలియదు కదా అందుకే ఇప్పటి నుంచి పని చేయడం నేర్చుకుంటున్నాను అని అంటుంది జానకి. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha june 1 Today Episode : చిన్మయి విషయంలో బాధపడుతున్న రాధ.. ఆదిత్య మాటలకు షాక్ అయిన సత్య..?