RRR World Record : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొడుతోంది.
ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ అంతర్జాతీయ మూవీ డేటా బేస్ సంస్థలో (ఐఎండీబీ) మోస్ట్ పాపులర్ లిస్ట్‌లో ఉన్న ప్రపంచ వ్యాప్త టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఏకైక ఇండియన్ సినిమాగానూ రికార్డు సాధించింది.
మరోవైపు.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఇతర హాలీవుడ్ సినిమాలను మించి ఎక్కువ రేటింగ్ కూడా నమోదు కావటం గమనార్హం. అంతే కాదండోయ్… కథలో భావోద్వేగాల్ని పండించడంలో మాస్టర్ రాజమౌళి. ఆయన సినిమా అంటే భావోద్వేగాలతో పాటు, తెరకు నిండుదనం తీసుకొచ్చే విజువల్ గ్రాండ్‌నెస్ కూడా. ఆ రెండు విషయాల్లో తనదైన ప్రభావం చూపించి తాను ‘మాస్టర్ కెప్టెన్’ అని ఆర్ఆర్ఆర్తో మరోసారి చాటారు. మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది.
Read Also : Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!