Guppedantha Manasu April 25 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని ఎలా అయినా సరే వసు ని బాధ పెట్టాలి అని ప్లాన్ చేస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉండగా, ఇంతలో అక్కడికి వసు వస్తుంది. ఇక వసు ని చూసిన దేవయాని కోపంతో రగిలి పోతూ ఉంటుంది. వసు, రిషి పక్కన కూర్చోవడం చూసి జీర్ణించుకోలేకపోతోంది. ఇంతలో జగతి, రిషి కీ టిఫిన్ వడ్డించడానికి వెళ్లగా నాకు వద్దు అని సైగ చేయడంతో జగతి బాధపడుతుంది.

ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. అప్పుడు వసు ఒక బోండా ట్రై చేయండి సార్ చాలా బాగుంది అని రిషికీ చెబుతుంది. అప్పుడు రిషి, వసు ప్లేట్ లో బోండా ను తీసుకోగా మహేంద్ర గౌతమ్ లు చూసి ఆశ్చర్యపోతారు. కానీ దేవయాని మాత్రం కుళ్ళు కుంటూ ఉంటుంది. ఆతర్వాత దేవయాని రాజీవ్ కి ఫోన్ చేసి నేను చెప్పిన విషయం ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతుంది.
నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. వసు, రిషి ని వదిలిపెట్టి ఎక్కడైనా దూరంగా వెళ్లిపోవాలి అని చెబుతుంది. అప్పుడు అతను త్వరలోనే మీకు శుభవార్త చెబుతాను మేడం అని ఫోన్ కట్ చేస్తాడు. దేవుని అనే మాటలు చాటుగా విన్న ధరణి, ఆ విషయం వెళ్లి జగతి తో చెబుతుంది. మరోవైపు కాలేజీ స్టూడెంట్ ధనుష్ రిషి, వసు గురించి తప్పుగా మాట్లాడతాడు.
ఆ మాటలు విన్న వసు అక్కడినుంచి బాధతో వెళ్ళిపోతుంది. ఇంతలో రిషి ఫోన్ చేయడంతో నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని అంటుంది. వసు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వసుకీ రాజీవ్ ఎదురు పడతాడు. ఇక రాజీవ్ ని చూసిన వసు భయపడుతూ ఉంటుంది. కాని రాజీవ్ మాత్రం మంచి వ్యక్తుల నటిస్తూ వసు ని బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో వసు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడం తో రిషి వసు పనిచేసే హోటల్ కి వెళ్తాడు. అక్కడ రాజీవ్ ఎప్పుడు మీ రిషి సార్ సేవలోనే తరీస్తావా కొంచెం మా ఆర్డర్ కూడా తీసుకో అని అనడంతో రిషి కోపంతో రగిలిపోతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu April 23 Today Episode: వసుపై పగబట్టిన దేవయాని.. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజీవ్..?