...

Rashmika Mandanna: రష్మిక నీకెందుకంత పొగరు… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎలాంటి విషయాల గురించి అయినా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా రష్మిక చేసే డాన్స్ వీడియోలు లేదా ఫోటోలను షేర్ చేసే సమయంలో కొన్నిసార్లు నెటిజన్ల నుంచి భారీ ట్రోలింగ్స్ ఎదుర్కొంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి బలై పోయింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ నిమిత్తం రష్మిక రిషికేష్ వెళ్తోంది. అందులో భాగంగానే ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఇలా ఎయిర్ పోర్ట్ లోకి అడుగు పెట్టగానే మీడియా కంటపడిన రష్మిక పై మీడియా ఫోకస్ చేస్తూ ఆమెకు ఫోటోలు తీయడం మొదలుపెట్టారు.

ఈ విధంగా ఫోటోలకు ఫోజులిచ్చిన రష్మిక మాస్క్ తీయమని మీడియా ప్రతినిధులు కోరగా రష్మిక మాస్క్ తీసిఫోటోలకు ఫోజులు ఇచ్చారు ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది ఈమె వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఏముందనే విషయానికి వస్తే…రష్మిక ముంబై ఎయిర్ పోర్ట్ లోకి ఎంటర్ కాగానే కారు దిగి వెళ్ళిపోయింది కనీసం కారు డోర్ కూడా వేయకుండా వెళ్లడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక ఎంత పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయితే అంత పొగరు పనికిరాదు. . కనీసం మానవత్వం బాధ్యత కూడా లేదా అని కామెంట్ చేస్తున్నారు.