...

Radhe Shyam Pre Release Event Live : రాధే శ్యామ్ ప్రీ-రీలీజ్ ఈవెంట్.. ట్రైలర్ రిలీజ్..!

Radhe Shyam Pre Release Event Live : ప్రభాష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ తరుణం వచ్చేసింది.. రెబల్ స్టార్ ప్రభాష్ నటించిన కొత్త మూవీ రాధే శ్యామ్ ట్రైలర్ మరికాసేపట్లో రిలీజ్ కాబోతోంది. భారీ ఫ్యాన్ప్ సమక్షంలో రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ అభిమానులకు ఇది స్పెషల్ రోజు అనే చెప్పాలి. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రాధేశ్యామ్ మూవీకి భారీ అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయింది.

పాన్ ఇండియా లెవల్లో ప్రభాష్ ఫ్యాన్స్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. జనవరి 14న రాధేశ్యామ్ మూవీ విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‏లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.


రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుకకు సుమారు 40 వేల మంది ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏కు జాతిరత్నం హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ‘రాధే శ్యామ్’ ప్రంపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

Read Also : Radhe Shyam Trailer : రాధేశ్యామ్ ట్రైలర్ వచ్చేస్తోంది.. ప్రభాష్ ఫ్యాన్స్‌కు పండగే..!