Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
జరిగిన విషయాన్ని తలచుకొని శృతి, ప్రేమ్ లు బాధపడుతూ ఉంటారు. అప్పుడు శృతి మాట్లాడుతూ.. ఎందుకు ప్రేమ్ ఆంటీ ఇలా ప్రవర్తిస్తున్నారు.. అంకిత అభి వాళ్ళు ఇక్కడికి రావడం తప్ప వస్తే ఏమవుతుంది అని అడగడంతో.. అప్పుడు ప్రేమ్ అమ్మ బాధ అది కాదు శృతి నేను మ్యూజిక్ వదిలేసి ఆటో నడుపుతున్నాను కదా అందుకే అలా మాట్లాడుతోంది అని చెబుతాడు ప్రేమ్. అలా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే శృతి తులసి అన్న మాటలకు కోపం వచ్చి ఇలా మన మారడానికి కారణం ఆంటీ నే కదా వెళ్ళి ఆంటీని నిలదీయు అని చెబుతుంది. కానీ ప్రేమ్, శృతి మాటలు పట్టించుకోడు. ఇక కోపంతో శృతి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు ప్రేమ్ లోపలికి వెళ్లి నేను ఆటో నడవకపోతే ఎలా అని అనగా అప్పుడు శృతి ఆంటీ చెప్పింది కదా నీ లక్ష్యం వైపు అడుగులు వెయ్యి, ఇంటి బాధ్యతలు నేను చూసుకుంటాను నేను పనిచేసి సంపాదిస్తాను అని చెబుతుంది.
ఆ మాటకు ప్రేమ్ శృతి చేతులు పట్టుకుని ఎమోషనల్ అవుతాడు. మరొక వైపు లాస్య, నందు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నిర్ణయించుకుంటారు. వారితో పాటు అనసూయ దంపతులు కూడా నందు తో పాటు వచ్చేలా చూడమని తులసిని ప్రాధేయపడతాడు. అప్పుడు తులసి ఆలోచనలో పడుతుంది. మరొకవైపు అనసూయ దంపతులు నందుతో కలసి బయటకు వెళ్లడానికి ఇష్టపడదు.
దీనితో తులసి బ్యాట్ పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోవడానికి బయలుదేరుతుంది. అప్పుడు అనసూయ దంపతులు అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మ అని అడగగా.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను మావయ్య.. మీకు నందుతో వెళ్లడం ఇష్టం లేదు కాబట్టి నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా. మీరు లేకుండా ఆయన వెళ్లలేరు.. లాస్య ఉండగా మీరు వెళ్ళలేరు అందుకే వీటన్నింటికీ పరిష్కారం నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే అని చెబుతుంది తులసి.
ఇక అప్పుడు అనసూయ దంపతులు నువ్వు ఎక్కడికి వెళ్ళకు తులసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడినుంచి ఎమోషనల్ అవుతూ వెళ్ళిపోతారు. ఇక తులసి ఒకవైపు నందుకు చెప్పలేక, మరొక వైపు అత్తమామలకు చెప్పలేక కుమిలిపోతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..