సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 28 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన ఈ చిత్రానికి సంబంధించిన రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మహేష్ కు ఫైనల్ నరెషన్ ఇచ్చిన త్రివిక్రమ్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ తో కలిసి మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలు పెట్టేసారు.ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా రోజుకో సెలబ్రిటీ పేరు బయటకొస్తుంది.
తాజాగా మరో స్టార్ హీరోయిన్ నేమ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మహేష్ త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. సాంకేతిక నిపుణులను కూడా ఇప్పటికే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ 28వ సినిమాలో నటించే నటీనటుల గురించి ఓ ఆసక్తి కరమైన రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ సోదరి గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుందట. ఎస్ఎస్ఎంబి28 చిత్రాన్ని యాక్షన్ జోనర్లో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించినట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.అయితే త్రివిక్రమ్ దీనికి సిస్టర్ సెంటిమెంట్ ని జత చేయబోతున్నారట. ఇందులో కీలకమైన చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవి ఐతే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట.
ఇదే కనుక నిజమైతే భోళాశంకర్ చిత్రంలో చిరంజీవి సిస్టర్ గా నిరాకరించిన పల్లవి మరి ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన సోదరిగా నటించడానికి అంగీకరిస్తుందో లేదో చూడాలి. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇంతకు ముందు అతడు, ఖలేజా వంటి క్లాసిక్ మూవీస్ తెరకెక్కాయి. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మూడో సినిమా కోసం కలిస్తుండడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. శ్రీమతి మమత సమర్పణలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై, ఎస్.రాధాకృష్ణ, చిన్న బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అన్నీ కుదిరితే మహేష్ బాబు 28వ చిత్రాన్ని పాన్ ఇండియాప్రాజెక్టుగా చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత ఆ మధ్య హింట్ ఇచ్చారు. సర్కారు వారి పాట చిత్రాన్ని చివరి దశకు తీసుకొచ్చిన మహేష్ త్వరలోనే త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారని టాక్ వినిపిస్తోంది.