...

Anchor Anasuya: యాంకర్ అనసూయ వస్త్రధారణపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు… ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్!

Anchor Anasuya: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. తన మాటలతో చలాకీతనంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే అనుసూయ ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగిస్తూనే, మరొకవైపు వెండితెరపై మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే వెండితెర పై పలు సినిమాల్లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇలా అనసూయ బుల్లితెరపై అటు వెండి తెరపై నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

ఇకపోతే అనసూయ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా లో అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తు ఉంటుంది. ఇకపోతే అనసూయ సోషల్ మీడియాలో ఎక్కువగా డ్రెస్సింగ్ ఈ విషయంలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది. అనసూయ ఎటువంటి డ్రెస్ వేసినా కూడా అది ఒక సెన్సేషన్ అవుతుంది. ఇక చీరకట్టులో అనసూయ కనిపిస్తే కుర్రకారుకు అందాల కనువిందు అని చెప్పవచ్చు. అనసూయ చీరకట్టులో తన నాభి అందాలను ప్రదర్శిస్తూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు అనసూయ చీరకట్టు లో కనిపించిన విషయం తెలిసిందే.

చీరకట్టులో అనసూయ ని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అయితే అనసూయ చీర అందాలకు అభిమానులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ శ్రీరామనవమి సందర్భంగా ఈ టీవీ వారు నిర్వహించిన షో లో సందడి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈవెంట్ కి అనసూయ హోస్టింగ్ చేసింది. అంతేకాకుండా ఈ షో కి అనసూయ సాంప్రదాయబద్దంగా చీరకట్టులో కనిపించింది. ఇక అనసూయ ఆ విధంగా చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఎప్పుడూ ఇలాగే చక్కగా కనిపించ వచ్చు కదా! ఇదేవిధంగా వేరే షోలలో కూడా హోస్ట్ గా చేయవచ్చు కదా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.