Nayanathara vignesh wedding : హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరికీ గతేడాదే నిశ్చితార్ఖం జరిగింది. అయితే అభిమానులంతా వీరి పెళఅలి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుందని.. జూన్ 9వ తేదీన వీరి వివాహం ఉండనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరు ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. అయితే సినీ సెలబ్రిటీలు, ఇతర స్నేహితులు, బంధువుల కోసం చెన్నైలో గ్రాండ్ గా వివాహ విందు ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై నయన్, విఘ్నేష్ ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు విఘ్నేష్ దర్శకత్వంలో నయన తార, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన కాతువాకుల రెండు కాదల్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.