Ramya Raghupathi : గత కొన్ని రోజులుగా ప్రముఖ నటుడు కృష్ణ , విజయ్ నిర్మల గారి కుమారుడు వికె నరేష్ నాలుగో పెళ్లి గురించి రచ్చ జరుగుతోంది. నరేశ్ తన మూడవ భార్య రమ్య రఘుపతితో ఉన్న మనస్పర్థల కారణంగా గత 8 సంవత్సరాలుగా ఆమెకి దూరంగా ఉంటున్నాడు. అయితే నరేష్ క్యారక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో గత 4 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నరేష్, అతని మూడో భార్య రమ్య మీడియా ముఖంగా ఒకరిమీద ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.

naresh-and-pavitra-both-are-already-married-by-ramya-raghupathi
ఇటీవల కన్నడ ఛానల్ వారు నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్న రమ్య .. పవిత్రా లోకేష్ , నరేష్ మద్య ఉన్న రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో పవిత్రా లోకేష్, నరేష్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని ఆమె ఆరోపించింది. అందుకు సాక్ష్యం కూడా ఉంది… ‘‘ నిన్న ప్రెస్ మీట్ లో పవిత్ర నా భార్య అని నరేష్ అన్నారు.వారు పెళ్లి చేసుకున్నారు కాబట్టే నరేష్ అలా అన్నారు అని చెప్పుకొచ్చింది. నరేష్ ఇప్పటి వరకు నాతో విడాకులు తీసుకోలేదు. అలా నాకు విడాకులు ఇవ్వకుండా ఆయన ఎలా పెళ్లి చేసుకుంటారు. చట్టప్రకారం నేను ముందుకు వెళతాను’’ అని రమ్య చెప్పుకొచ్చింది.
ఇక ఈ విషయం గురించి నరేష్ కూడా మీడియా ముఖంగా స్పందించారు. నేను ఇప్పటి వరకు ముగ్గురు భార్యల నుండి విడిపోవచ్చు. దానికి వేరే కారణాలు ఉన్నాయి. అవసరానికి నన్ను వాడుకొని వారు వదిలేసి వెళ్లారు. ఇప్పటివరకు నేను వందల సినిమాలలో నటించాను. ఈ క్రమంలో ఎంతోమంది మహిళలతో పని చేశాను. కానీ ఇప్పటివరకు నేను ఎవరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించానని , వేదించానని ఎవరు అనలేదు. రమ్య నా జీవితంలోకి వచ్చి జీవితాన్ని నాశనం చేసిందని చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరిలో ఎవరు చెప్తున్నది నిజమో తెలియటం లేదు. మొత్తానికి ఇప్పుడు వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది మలుపు తీసుకుంటుందో చూడాలి మరి.
Read Also : Naresh -Ramya Raghupathi: విడాకుల కోసం గన్ గురిపెట్టి బెదిరించిన నరేశ్..రమ్య సంచలన వ్యాఖ్యలు..!