Karate kalyani: కరాటే కళ్యాణి అంటే తెలియని వారుండరు.కళ్యాణి పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. మొదట హరికథ కళాకారినిగా తన జీవితం ప్రారంభించిన కరాటే కళ్యాణి సినిమా అవకాశాలు రావడంతో ఆది సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కళ్యాణి సినిమాలలోనే కాకుండా పలు సీరియళ్లలో కూడా నటించింది. మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా కరాటే కళ్యాణి పాల్గొని గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం కరాటే కళ్యాణి వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచింది. యూట్యూబ్ శ్రీకాంత్ రెడ్డితో జరిగిన గొడవ కారణంగా కరాటే కళ్యాణి ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది.
ఇటీవల కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. కళ్యాణి అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు సహాయంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఇటీవల ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో కల్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి సోదరుడుని అధికారులు విచారించారు. ఈ క్రమంలో ఆమె తల్లి మాట్లాడుతూ.. తన కూతురు ఎటువంటి తప్పు చేయలేదని చట్టప్రకారంగానే చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఆమె తెలిపారు. చిన్నారిని శ్రీకాకుళం నుండి దత్త తీసుకున్నామని ఆ చిన్నారికి మౌక్తిక అని పేరు పెట్టినట్టు కళ్యాణి తల్లి వెల్లడించారు.
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో జరిగిన వివాదంపై పోలీసులను ఆశ్రయించిన కరాటే కళ్యాణి ఎస్ ఆర్ నగర్ సి ఐ సైదులు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద దాడి చేసిన వ్యక్తి పై ఫిర్యాదు చేస్తే ఇద్దరి మీద ఒకే రకమైన కేసులు పెట్టి నిందితుడికి వంతు పాడతారా అంటూ ఆమె సిఐ మీద ఫైర్ అయ్యారు. ఈ వివాదం గురించి సీఐ సైదులు మాట్లాడుతూ చట్టప్రకారంగానే ఇరువురి వద్ద ఫిర్యాదులు తీసుకొని ఇద్దరు మీద కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన తర్వాత మొదట దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World