Janaki Kalaganaledu: రామచంద్రను అవమానించిన జానకి.. కుమిలిపోతున్న రామచంద్ర..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

రామచంద్ర అటు కొడుకుగా ఇటు భర్తగా ఓడిపోయాను అని కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడు జానకి బాధపడకండి అంటూ రామచంద్ర ని ఓదారుస్తు ఉంటుంది. మరొకవైపు జ్ఞానాంబ స్వీట్ షాప్ ఓపెన్ చేయడానికి వెళుతుంది.

Advertisement

అక్కడ షాప్ ఓపెన్ చేసేటప్పుడు కష్టపడుతుండగా అది చూసిన రామచంద్ర సహాయం చేయడానికి వస్తాడు. అప్పుడు జ్ఞానాంబ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటూ రామచంద్ర అని నానారకాలుగా మాటలు అని బాధ పెడుతుంది. ఇంటిని రెండు ముక్కలు చేసిన నీ భార్యకు, ఈ స్వీట్ షాప్ నీ రెండు ముక్కలు చేయడం పెద్ద పనేమీ కాదు అని అంటుంది.

ఆ మాటకి రామచంద్ర మరింత కుమిలిపోతూ బాధపడతాడు. అప్పుడు జ్ఞానాంబ స్వీట్ షాప్ నాది ఈ ఎవరికీ ఎటువంటి అధికారం లేదు అని అంటుంది. ఆ తరువాత రామచంద్ర పని కోసం వెళ్లి అక్కడ పని అడగడానికి మొహమాటం గా ఫీల్ అవుతాడు. ఇక పని కోసం వెళ్లిన రామచంద్ర కు నిరాశే ఎదురవుతుంది.

Advertisement

ఆ తర్వాత కార్ఖానా ఓనర్ జ్ఞానాంబ కు ఫోన్ చేసి రామచంద్రబాబు మా ఖార్ఖానా కు పని కోసం వచ్చారు అని చెబుతాడు. అంతేకాకుండా మీ అబ్బాయి గారికి పని ఇచ్చేంత స్థాయి నాది కాదు అని చెబుతాడు. దాంతో జ్ఞానాంబ ఆవేదన చెందుతుంది. మరొకవైపు రామచంద్ర ఇంటికి వెళ్లి పని దొరకలేదు అని జానకితో చెప్పి బాధపడుతూ ఉంటాడు.

జ్ఞానాంబ కొడుకు అంటే ఎవరూ పని ఇవ్వడం లేదు అని బాధ పడతాడు. జానకి రామచంద్ర ని బాధపడకు అనే ఓదారుస్తూ ఉంటుంది. మరొకవైపు జ్ఞానాంబ కుటుంబ సభ్యులందరికీ అమెరికా నుంచి గిఫ్టులు రాగా ఇదంతా జానకి పని అంటూ పుల్లలు పెడుతుంది. ఇప్పుడు జ్ఞానాంబ ఆ గిఫ్ట్ లు తీసుకెళ్లి రామచంద్ర ఇంటి ముందు పెట్టి నానా రచ్చ చేస్తుంది.

Advertisement

ఆ తరువాత మల్లిక జానకి అన్నయ్య కు ఫోన్ చేసి జానకి పడుతున్న కష్టాల గురించి వివరిస్తుంది. కాబట్టి వచ్చి జానకిని తీసుకెళ్లండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. దీనితో జానకి అన్నయ్య బాధపడుతూ ఉంటాడు.రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement