Janaki Kalaganaledu: జ్ఞానాంబని అరెస్టు చేసిన పోలీసులు.. జానకిని తప్పుగా అపార్థం చేసుకున్న జ్ఞానాంబ..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

ఉగాది పండుగ సందర్భంగా ఈ పండుగను ఆనందంగా జరుపుకుందాం అంటూ మల్లిక హడావిడి చేస్తూ ఉంటుంది. కానీ జ్ఞానాంబ కుటుంబ సభ్యులు మాత్రం రామచంద్ర, జానకి లేనందుకు బాధపడుతూ ఉంటారు. మరొకవైపు గుడిసెలో రామచంద్ర, జానకి లు ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటారు. జ్ఞానాంబ ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటుంది.

ఇంతలో గోవిందరాజూ జ్ఞానాంబ దగ్గరకు వచ్చి అందరూ బాధతో ఉంటే ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి అని అనగా అప్పుడు జ్ఞానాంబ ఈ రోజు కొత్త సంవత్సరం మన దగ్గర నుంచి ఎవరు వెళ్లిపోయినా కాలం మాత్రం ఆగదు కదా అని అంటుంది. ఆ తర్వాత గోవిందరాజు ఉగాదిపచ్చడి తీసుకెళ్లి కొడుకు కోడలికి పెడతాడు.

Advertisement

మరొకవైపు జ్ఞానాంబ జానకి పై మరింత ద్వేషం పెంచుకుంటూ ఉంటుంది. పండుగ సందర్భంగా గుడికి వెళ్తారు జానకి రామచంద్ర లు. గుడిలో తన వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే మన్నించమని దేవుడిని కోరుకుంటూ ఉంటుంది జానకి. మరొకవైపు జానకి అన్న యోగి వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి జ్ఞానాంబ ఫై పోలీస్ కేసు పెడతాడు.

జ్ఞానాంబ ఇంటికి వచ్చిన పోలీసులు మిమ్మల్ని గృహహింస చట్టం కింద మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అని చెప్పడంతో జ్ఞానాంబ పోలీసులతోపాటు వెళుతుంది. అయితే మల్లిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపల సంతోషపడుతూ బయటికి మాత్రం బాధను నటిస్తూ ఉంటుంది.

Advertisement

జ్ఞానాంబ కుటుంబ సభ్యులు ఆపడానికి ఎంత ప్రయత్నించినా కూడా జ్ఞానాంబ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. జ్ఞానాంబ ను పోలీసులు జీపులో చూసిన రామచంద్ర టెన్షన్ పడుతూ జీపు వెనకాలే ఫాలో అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement