Prabhas: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వేణు స్వామి గురించి ఆయన తట్టిలేపే వివాదాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం యూట్యూబ్ లో ఎవరో ఒక సెలబ్రేటి జాతకం గురించి ఉన్నది లేనిది అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటాడు. ఒకవేళ వేణుస్వామి వేసిన జాతకం రాళ్లు తగిలితే నిజమని ఒకవేళ జరగకపోతే జనాలు అబద్ధం అని నమ్ముతూ ఉంటారు.ఇక పలువురు సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు కూడా వేణు స్వామి జాతకాలు చెబుతూ ఉంటాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వివాదాస్పద స్వామి గా కూడా పేరు తెచ్చుకున్నాడు వేణు స్వామి.
ఇక ఇదే క్రమంలో హీరో ప్రభాస్ ను కూడా ఆడిపోసుకున్నాడు వేణు స్వామి. అదేలా అంటే.. ప్రభాస్ నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆగిపోతున్నాయని.. నిర్మాతలు చాలా నష్టపోతున్నారని వేణు స్వామి వాపోయాడు.అంతేకాకుండా ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించవద్దని వేణు స్వామి వెల్లడించారు. ఇక ఈ మాటలు విన్న ప్రభాస్ ఫాన్స్ ఇంకా ఎక్కడ ఆగుతారు.. వెంటనే వేణు స్వామి పై నానారకాలుగా విరుచుకుపడుతున్నారు. కామెంట్ల రూపంలో మాటల తూటాలు వదులుతున్నారు. ఇక వేణుస్వామి మాటలపై ప్రభాస్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి అంటే వేచిచూడాల్సి ఉంది.
ఇక ప్రభాస్ రాబోయే సినిమాల విషయానికొస్తే.. ఆది పురుష్ కాగా ఈ సినిమాకి ఓం రౌట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సలార్ మూవీలో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా ప్రభాస్ స్పిరిట్, ప్రాజెక్టు K సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 14న విడుదల అయ్యే సలార్ మూవీలో ప్రభాస్ ప్రేక్షకుల ను ఎంతగా మెప్పిస్తాడో చూడాలి.