Ajith -Vijay: హీరో విజయ్ చనిపోయాడు… అజిత్ కు ఎయిడ్స్..ఫాన్స్ మధ్య వార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్!

Ajith -Vijay: తమిళ స్టార్ హీరోలు విజయ్ దళపతి అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారనే విషయం మనకు తెలిసిందే అయితే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉంటారు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఫ్యాన్స్ మధ్య గొడవలు రావడంతో అభిమాన హీరోలను కూడా సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున ట్రోల్ చేస్తుంటారు. తాజాగా మరోసారి ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా తమిళ స్టార్ హీరో విజయ్ చనిపోయాడని ఆయన ఫోటోకి దండ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ #RIPJosephVijay అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. విజయ్ అర్ధంతరంగా మరణించాడని ఆయన నటించిన బీస్ట్ చిత్రమే చివరి సినిమా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇలా తన అభిమాన హీరో చనిపోయాడంటూ ట్వీట్లు చేయడంతో రెచ్చిపోయిన విజయ్ అభిమానులు తప్పకుండా ఈ పని అజిత్ ఫ్యాన్స్ చేసి ఉంటారని భావించి హీరో అజిత్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.

Advertisement

ఈ క్రమంలోనే హీరో అజిత్ కు ఎయిడ్స్ ఉందంటూ
#Aids_Patient_Ajith అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ విధంగా వీరిద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ల వార్ జరుగుతుంది. ఈ విధంగా ఇద్దరీ హీరోల అభిమానులు ఒకరి గురించి మరొకరు గొడవ పడుతూ ఒకరి చనిపోయారని మరొకరు రోగంతో బాధ పడుతున్నారని లేనిపోని రోగాలన్నింటినీ అంటగట్టి హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అంటూ నెటిజన్లు పెద్దఎత్తున ఈ హీరోల అభిమానుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement