Dishtibomma : చాలా మంది గృహాలు నిర్మించేటప్పుడు లేదా గృహ ప్రేవశం చేసేటప్పుడు… మామూలు ఇళ్లకు కూడా దిష్టి బొమ్మలు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. అవి పెట్టుకోవడం వల్ల మన ఇంటిపై కానీ, మనపై కానీ ఎలాంటి దిష్టి పడదని నమ్మకం. కానీ చాలా మంది భయంకరంగా ఉండే బొమ్మలను దిష్టి బొమ్మలుగా పెడ్తుంటారు. కానీ వాటిని దిష్టి బొమ్మ అని పిలవకూడదని వేద పండితులు చెబుతున్నారు.
దిష్టిబొమ్మ అంటే పూర్వ కాలంలో ప్రతీ ఇంట్లో శ్రీ ముఖం పెట్టేవారు. ఈ ముఖం చాడడానికి రాక్షసుడిలా కనిపించిన ఈ శ్రీ ముఖంపై నాలుకపై తేలు, రెండు కోర మీసాలు, నుదిటపై నెలవంక ఉంటుంది.
ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే మనకు చూడగానే మన మైండ్ ఆ బొమ్మ పై ఉన్న సింబల్స్ పైకి వెళ్తుంది. దీని ద్వారా మన దృష్టి ఏదైనా ఉంటే ముందుగా ఆ బొమ్మ పైకి వెళ్తుంది తప్ప ఆ ఇంటి పైకి వెళ్లదు. ఈ శ్రీ ముఖాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లు అయితే మనకు అన్నీ లాభాలే కల్గుతాయని నమ్మకం. అలాగే సుఖమైన జీవన విధానం ఆ ఇంట్లో ఉంటుందని ఆథ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Also :Devotional: గోమాతకు ఈ ఒక్కటి పెడితే చాలు.. ఎంతో మంచి జరుగుతుంది