Sudigali Sudheer: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ ఆతర్వాత పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా యాంకర్ గా ఎంతో పాపులారిటీ దక్కించుకున్నారు. ఈయనకు ఉన్న పాపులారిటీ ద్వారా సినిమా అవకాశాలను కూడా దక్కించుకున్నారు. సినిమా అవకాశాలు అంటే సైడ్ క్యారెక్టర్ లో కాకుండా హీరోగా వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్నారు
ఇలా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుదీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఒకవైపు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మరోవైపు వెండితెరపై పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సుధీర్ ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ ఒకరోజు కాల్ షీట్ కోసం ఏకంగా ఏడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో సినిమాకు ఈయన 70 నుంచి 100 రోజుల వరకు కాల్షీట్స్ ఇస్తారని తెలుస్తోంది.
ఇలా చూసుకుంటే సుధీర్ ఒక సినిమాని మూడు నెలలలో పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రకారం సుధీర్ ఒక సినిమాకి దాదాపు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విధంగా ఒక్కో సినిమాకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే సుధీర్ కు ఉన్న క్రేజ్ కు చాలా తక్కువ అని అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సుధీర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు కనుక హిట్ అయితే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోతారని ఇప్పటికే నిర్మాతలందరూ సుధీర్ కోసం క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.
Read Also : Bigg Boss Telugu OTT Live : లైవ్ స్ట్రీమింగ్ అసలు నిజమేనా? ఎంత మంది చూస్తున్నారు?
Tufan9 Telugu News And Updates Breaking News All over World