Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజులు విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండటమే కాకుండా వాణిజ్య ప్రకటనలకు కూడా సై అంటున్నాడు. ఇటీవలే శుభగ్రహ రియల్ ఎస్టేట్ కి మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈ యాడ్ లో నటించినందుకు చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.
చిరంజీవితో పాటు ఈ యాడ్ లో సీనియర్ నటి కుష్బూ నటించారు. అలాగే హాట్ యాంకర్ అనసూయ కూడా ఇందులో సందడి చేశారు. ఇలా సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ యాడ్ సూపర్ హిట్ అయ్యింది. గతంలో థమ్స్ అప్ యాడ్ ద్వారా చిరు ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నారో తిరిగి ఈ యాడ్ ద్వారా అంతే గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే శుభగ్రహ రియల్ ఎస్టేట్ కోసం మెగాస్టార్ ఏకంగా ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విధంగా అతి తక్కువ నిడివిగల ఈ యాడ్ లో నటించడం కోసం చిరంజీవి ఏకంగా ఏడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలియడంతో ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం మెగాస్టార్ ఎక్కడున్నా మెగాస్టారే… మెగస్టార్ రేంజ్ అంటే ఇదే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.