Shiva jyothi : వ్యూస్ కోసం తప్పుడు వార్తలు రాయకండి… ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇచ్చిన శివజ్యోతి!

Shiva jyothi
Shiva jyothi

Shiva jyothi : వీ6లో ‘తీన్మార్’, ‘టీవీ9’ లో ‘ఇస్మార్ట్ న్యూస్’ వంటి షోలతో బాగా పాపులర్ అయ్యింది శివ జ్యోతి. ఈమె అసలు పేరు శివ జ్యోతి అయినప్పటికీ సావిత్రక్కగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న శివజ్యోతి తనకు ఉన్న పాపులారిటీతో బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్నారు.ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా టాప్ సిక్స్ లో ఉన్న శివ జ్యోతి ఈ కార్యక్రమంతో బాగా ఫేమస్ అయ్యారు.

బిగ్ బాస్ తర్వాత వరుస టీవీ షోలలో పాటిస్పేట్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించి తనకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇక ఎన్నో టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్న శివజ్యోతి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం గురించి తెలియజేశారు. అలాగే తాను పిల్లల కోసం ఎంతో ఎదురు చూస్తున్నాననే విషయాన్ని కూడా తెలియజేశారు.

Advertisement

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం శివజ్యోతి తన భర్తతో కలిసి పచ్చి మామిడి పళ్ళు తింటూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ పెద్దఎత్తున వార్తలను సృష్టించారు.ఇలా తన ప్రెగ్నెన్సీ గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై శివజ్యోతి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ అనేది మా జీవితంలో చాలా పెద్ద విషయం ఎన్నో రోజుల నుంచి మా కుటుంబ సభ్యులు ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు.

ఇలా ఎంతో ఎమోషనల్ గా ఉన్నటువంటి ఈ విషయాన్ని చాలా మంది వారి స్వార్థం కోసం, వారి ఛానల్ వ్యూస్ కోసం తప్పుగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి ఏదైనా అలాంటి శుభవార్త ఉంటే తప్పకుండా నేనే అందరికీ చెబుతాను అంతేకాని ఇలా తప్పుడు వార్తలు రాయకండి అంటూ తన ప్రెగ్నెన్సీ గురించి శివ జ్యోతి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Read Also : Naga Chaitanya : రెండో పెళ్లికి నాగచైతన్య రెడీ.. మళ్లీ హీరోయిన్‌తో ప్రేమలో..? అఖిల్ కోసం అమ్మాయిని వెతుకుతున్న నాగ్..?

Advertisement