Saturday special : మన హిందూ సంప్రదాయాల ప్రారం శని వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ప్రతి వారం ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే శనివారం రోజున కొన్ని పనులు చేయకూడదని, కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అయితే అలా ఎందుకు చేయాలి, శనివారం అస్సలే కొనకూడని వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారం రోజున నల్ల రంగు వస్తువులను అస్సలే కొనకూడదట. అలాంటివి కొనడం వల్ల ఇంట్లో కష్టాలు విపరీతంగా పెరిగిపోతాయట. శనివారం రోజు శనీశ్వరుడిని నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదంటారు. కానీ అదే రోజున ఈ నూనెను కొనుగోలు చేసి దీపం పెట్టడం వల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువ. అంతకు ముందు రోజే నల్ల నువ్వులు లేదా నూనె కొనుగోలు చేయాలి. వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. దాని వల్ల చాలా లాభాలు కల్గుతాయి.
అంతే కాదండోయ్ ఇనుము ఉత్పత్తులు అంటే కత్తెర, కత్తులు అస్సలే కొనకూడదట. పర్సులు, బూట్లు, బ్యాగులు లేదా లెదర్ వస్తువులు కూడా కొనకూడదట. ఉప్పును కూడా ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదట. శనివారం రోజు ఉప్పును కొనడం వల్ల ఆర్థిక సంక్షోభంతో పాటు అప్పులు కూడా అవుతాయట. కార్లు, వాహనాలు, ఇంక్, పెన్నులు, పెన్సిల్లు కూడా కొనకూడదు. అలాగే గోర్లు కూడా కత్తిరించకూడదు.
Read Also: Shani Jayanthi : శని దోషం తొలగిపోవాలంటే శని జయంతి రోజున ఈ పరిహారం చేస్తే చాలు..?