Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రిషి, తనతో పాటు ఎగ్జామ్ హాల్ దగ్గరికి రావడం లేదు అని వసు బాధపడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వసు బాధ పడుతూ ఉండగా అప్పుడు జగతి జీవితంలో మనకు ఎవరు తోడు రారు అని మనం ఎదుర్కోవాలి అని అంటుంది. ఆ తర్వాత రిషి,వసు ఇద్దరూ కారులో వెళ్తుండగా, అప్పుడు వసుధార మీరు కూడా నాతో పాటు వచ్చి ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉండేది, ఎగ్జామ్ కూడా బాగా రాసేదాన్ని అని అడుగుతుంది.
Guppedantha Manasu
మరొకవైపు గౌతమ్ వసు నువ్వు చెప్పాక ఈ జీవితం మీద ఆసక్తి పోయింది అని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార రెస్టారెంట్ కి దగ్గరలో బస్సు ఎక్కుతున్నాను వీలుంటే రండి సార్ అని చెప్పి మెసేజ్ పెడుతుంది. అంతేకాకుండా బెస్ట్ ఆఫ్ ల చెప్పకపోతే ఎగ్జామ్ రాయను అని కూడా మెసేజ్ చేస్తుంది.
వసు కోసం రెస్టారెంట్ కి జగతి, మహేంద్ర లు వస్తారు. అప్పుడు జగతి ఎదుటి వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో అది మనం కూడా ఆలోచించాలి అని అంటుంది. వారందరూ మాట్లాడుతూ ఉండగా పక్కనే రిషి కూడా ఉంటాడు. అప్పుడు రిషి వసు కి బెస్ట్ ఆఫ్ లక్ అని మెసేజ్ చేయడంతో వసు ఆనందపడుతుంది.
మరొక వైపు దేవయాని వసు స్కాలర్ షిప్ టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది అని సాక్షితో చెబుతుంది. అప్పుడు సాక్షి ఆ విషయం నాకు వదిలేయండి ఆంటీ నేను చూసుకుంటాను అని ఇద్దరూ కలిసి వసు విషయంలో కుట్రపన్నుతారు.
మరొకవైపు వసు బస్సు ఎక్కుతుండగా రిషి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడు రిషి ఒక దగ్గర నుంచి కనపడకుండా వసు ని గమనిస్తూ ఉంటాడు. ఇక వసుకి ఆల్ ద బెస్ట్ చెప్పి సెండాఫ్ ఇస్తారు మహేంద్ర దంపతులు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also :Guppedantha Manasu: రిషి కోసం బాధ పడుతున్న వసు..వసు పై మాస్టర్ ప్లాన్ వేసిన దేవయాని,సాక్షి..?