Akshaha Tritiya: ఏడాదికి ఒకసారి వచ్చే అక్షయ తృతీయను పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు మహిళలు తమకు తోచినంత బంగారు వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు.ఈ క్రమంలోనే అక్షయ తృతీయ రోజు ఉదయమే పూజ చేసి బంగారు దుకాణాలకు వెళ్లి బంగారు నగలను కొనుగోలు చేయడం వల్ల వారి ఆస్తి సంపద వృద్ధి చెందుతుందని భావిస్తారు.అయితే ఇలా బంగారం కొనుగోలు చేయడం వల్ల మంచి కలుగుతుందని మనకి పురాణాలలో ఎక్కడ తెలియజేయలేదు.అక్షయ తృతీయ రోజు ఎంతో పవిత్రమైన దినం కనుక ఈ రోజు కొన్ని దానాలు చేయడం వల్ల మనకు అదృష్టం కలిసివస్తుందని సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
జాతకరీత్యా నక్షత్ర, గ్రహ దోషాలతో ఇబ్బంది పడేవారు ఈరోజు చిన్నపాటి సహాయం చేసిన ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. అందుకే అక్షయ తృతీయ రోజు పెరుగన్నం, చెప్పులు గొడుగు, నీళ్లు వంటి వస్తువులను దానం చేయడం ఎంతో మంచిది.వేసవి కాలంలో ఈ వస్తువులతో ఎంతో అవసరం ఉంటుంది కనుక ఈ వస్తువులను దానం చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.
ఎవరైతే వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటివారు అక్షయ తృతీయ రోజు మంచం దానం చేయటం మంచిది. అలాగే వివాహం ఆలస్యం అవుతున్నా, లేదా వివాహంలో ఆటంకాలు కలుగుతున్నా, పిత్రు దోషాలతో వచ్చే సమస్యలు తొలగిపోవాలంటే అక్షయ తృతీయ రోజు వస్త్ర దానం చేయటం మంచిది. ముఖ్యంగా తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషపడి పితృ దోషాలు తొలగిపోతాయి. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా దానధర్మాలు చేయడం వల్ల అధిక పుణ్య ఫలాన్ని పొందవచ్చు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World